అబ్బో.. ఒక్కోసారి టైట్ అయిపోయిన జార్ మూత తిప్పడం అంటే.. పెద్ద తలనొప్పే!! అదెంత కష్టమో అందరికీ తెలుసు. ఫ్రిడ్జ్‌లో ఉన్న పచ్చడి జార్ అయినా.. కొత్త జ్యూస్ బాటిల్ అయినా.. చుట్టూ ఎవరూ లేకపోతే చేతులతో తిప్పితిప్పి చికాకుతో వదిలేయాల్సిన పరిస్థితి. లేదంటే పక్కన ఉన్నవారికి ఇచ్చి ఓపెన్ చేయమంటాం. అలా ఇబ్బందిపడే వాళ్లకోసం మంచి పరిష్కారం ఉంది. అదేంటో తెలుసా? ఈ ఫ్లాస్ట్రెయిన్ మల్టీ పర్పస్ గ్రిప్ జార్ – బాటిల్ ఓపెనర్. ఇది పెద్దగా కష్టపడే పని లేకుండానే మూతల్ని తీసేస్తుంది. చేతికి సరిగ్గా ఫిట్ అయ్యేలా నాలుగు విభిన్న గ్రిప్ సైజులు ఉంటాయి. లోపల రబ్బర్ గ్రిప్ ఉండటం వల్ల జార్ మూతని గట్టిగా హోల్డ్ చేస్తుంది. ఒక్కసారి పట్టుకుని తిప్పితే చాలు.. పాత బాటిళ్లు అయినా మూత తిరగాల్సిందే. చాలా తేలికగా ఓపెన్ కావాల్సిందే. ముఖ్యంగా వృద్ధులకు, చేతిలో బలం తక్కువవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ చిన్న టూల్ ఇంట్లో ఉంటే మూతలు మీ మాట వినాల్సిందే!!
ధర: రూ. 499
దొరుకుచోటు: https://shorturl.at/jtlfc
ఒక్కో పనికి ఒక్కో గ్యాడ్జెట్ తీసుకెళ్లాలంటే.. చాలా కష్టం. అందుకే మల్టీపర్పర్ గ్యాడ్జెట్లు వచ్చేస్తున్నాయి. అలాంటిదే ఈ ఫోన్ కూడా. మీ ఊహల్ని స్కెచ్‌లా గీయాలనుకున్నారా? అయితే, మోటరోలా ఎడ్జ్ 60 స్టయిలస్ మీ చేతిలో ఉండాల్సిందే! ఈ ఫోన్ స్టయిలస్ పెన్‌తోపాటు వస్తుంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. డ్రాయింగ్ చేయొచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. ఏఐ ఆధారిత స్కెచ్ టు ఇమేజ్ ఫీచర్‌తో మీరు గీసిన బొమ్మని డిజిటల్ ఆర్ట్‌లా మార్చేయొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. సోనీ లైటియా (Sony LYTIA) 700 సీ 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. దీంతో ఫొటోల క్లారిటీకి తిరుగులేదు. ఓఐ ఎస్తో షేకింగ్ లేని ఫొటోలు.. యాక్షన్ షాట్‌తో బ్లర్లేని స్నాప్స్ తీసుకోవచ్చు. మేజిక్ ఇరేజర్తో బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ కూడా సింపుల్. ఇంకా 13 ఎంపీ అల్ట్రావైడ్ + మాక్రో లెన్స్ ఫ్రేమ్‌లోనూ ఫొటోగ్రఫీ అదిరిపోతుంది. సెల్ఫీలకు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఇతర ప్రత్యేకతల విషయానికొస్తే.. 6.7 అంగుళాల పీ ఓలెడ్ డిస్ప్లే. స్టీరియో స్పీకర్లలో డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంది. ఐపీ 68 రేటింగ్‌తో నీటిని, ధూళిని తట్టుకోగలదు. స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యాం, 256 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి వచ్చింది. మైక్రో ఎస్డీతో 1 టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ధర: రూ. 22,999
దొరుకుచోటు: https://shorturl.at/cRvkE
ఫోన్లో మ్యూజిక్ వినటం.. వెబ్ సిరీస్‌లలో మునిగిపోవడం.. ఫ్రెండ్స్‌తో గేమింగ్.. ఇవే ఎక్కువగా చేస్తుంటారా? అయితే, ఆయా యాక్టివిటీస్‌లో వావ్!!! అనిపించే ఫీల్ రావాలంటే? కచ్చితంగా క్వాలిటీ ఇయర్ బడ్స్ కావాలి. మరైతే అందుకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవే రియల్ మి బడ్స్ టీ 110. ఇవి చూడ్డానికి చాలా స్టయిలిష్‌గా ఉంటాయి. పక్కాగా పనిచేస్తాయి కూడా. ఈ బడ్స్‌లో ఉండే 10 ఎంఎం డైనమిక్ బూస్ట్ డ్రైవర్లు నాణ్యమైన బాస్‌తో మ్యూజిక్‌ని మిక్స్ చేసి.. థియేటర్ అనుభూతిని ఇస్తాయి. అంతేకాదు.. గేమ్స్ ఆడేటప్పుడు ఆడియోలో ఎలాంటి డిలే ఉండదు. దీంట్లో ఉండే ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC) టెక్నాలజీ.. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోని శబ్దాన్ని తగ్గిస్తుంది. దీంతో మాటలు క్లియర్‌గా వినిపిస్తాయి. మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే.. 10 నిమిషాలు చార్జ్ పెడితే 120 నిమిషాలపాటు బడ్స్ని వాడుకోవచ్చు. హడావుడిలో చార్జింగ్ పెట్టే టైమ్ లేకపోయినా టెన్షన్ లేదన్నమాట. ఈ బడ్స్ ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తున్నాయి. దీంతో వర్కౌట్స్‌కి, జాగింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చు. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో కనెక్టివిటీ స్టేబుల్‌గా ఉంటుంది. మొత్తం ప్లే టైమ్ 38 గంటలు. స్టూడెంట్స్, వర్కింగ్ యంగ్ జనరేషన్‌కి బడ్జెట్లోనే బెస్ట్ చాయిస్ అనొచ్చు.
ధర: రూ. 1,499
దొరుకుచోటు: https://shorturl.at/0ZYuT
వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో ఎక్కువగా కిడ్స్ డ్రాయింగ్స్ వేయడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఇంట్లో పిల్లలు గీయడమో, రాయడమో మొదలుపెడితే!! రోజూ పేపర్ బండిళ్లు ఖర్చే. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే.. వీ కార్ప్ ఎల్సీడీ రైటింగ్ ట్యాబ్లెట్ ఉంటే సరి. ఈ 8.5 అంగుళాల డూడుల్ బోర్డ్ పెద్దవాళ్లకైనా, పిల్లలకైనా చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లలు బొమ్మలు గీసుకోవచ్చు. చదువుకుంటూ నోట్స్‌కూడా రాసుకోవచ్చు. ట్యాబ్లెట్‌పై రాసేందుకు ప్రత్యేక స్టయిలస్తో వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా తెరపై రాయొచ్చు. బ్లూ లైట్, స్క్రీన్ గ్లో లేకపోవడంతో.. పిల్లల కళ్లకి హాని లేకుండా సురక్షితంగా వాడుకోవచ్చు. అంతా రాసుకున్నాక.. ఒక్క బటన్ నొక్కితే స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది. ఎప్పుడైనా తప్పుగా బటన్ నొక్కకుండా స్మార్ట్‌లాక్ కూడా ఉంది. ఇంకేంటి.. హ్యాపీగా పేపర్ వృథా కాకుండా.. చార్జింగ్‌తో పని లేకుండా.. ఒకే బ్యాటరీతో ట్యాబ్‌ని చక్కగా వాడుకోవచ్చు.
ధర: రూ. 144
దొరుకుచోటు: https://shorturl.at/T8BO9