చక్కెర కన్నా చక్కని తీపి
తీపి అనగానే చాలామందికి టక్కున గుర్తుకువచ్చే పదార్థం చక్కెర. అనేక తీపి వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చక్కెరను పక్కనపెట్టరు. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రుచి తగ్గకుండా ఉపయోగించుకునే సహజ ప్రత్యామ్నాయాలు స్వీట్ జాబితాలో చేరాయి.
తీపి అనగానే చాలామందికి టక్కున గుర్తుకువచ్చే పదార్థం చక్కెర. అనేక తీపి వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చక్కెరను పక్కనపెట్టరు. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రుచి తగ్గకుండా ఉపయోగించుకునే సహజ ప్రత్యామ్నాయాలు స్వీట్ జాబితాలో చేరాయి. ఇవి ైగ్లెసెమిక్ ఇండెక్స్, పోషకాలు, రుచుల్లో తేడా కలిగి ఉన్నప్పటికీ భారతీయ వంటకాలలో ఉపయోగించుకునేందుకు అనువైనవి. ఒకరోజులో 10 శాతం కేలరీల కన్నా తకువ చకెరను వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా, రోజుకు రెండు టీ స్పూన్లకు మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా వాడుకోదగిన ఇతర స్వీట్నర్ల గురించి రీసెర్చ్
గేట్ అధ్యయనం వెల్లడించింది. వాటిని ఎలా వాడుకోవాలనే వివరాలు ఇవి…
బెల్లం: చకెరకు బదులుగా బెల్లం మంచి ప్రత్యామ్నాయం. ఇది తకువ ప్రాసెసింగ్‌తో తయారవుతుంది కాబట్టి ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని రుచి గాఢంగా ఉండి ఖీర్, హల్వా, లడ్డూల వంటి వంటకాలకు ప్రత్యేకమైన టేస్ట్ ఇస్తుంది.
తేనె: తేనెలో యాంటి ఆక్సిడెంట్లు, ఎంజైములు ఉంటాయి. అయితే తేనెను అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయకూడదు. చల్లని లేదా కొంచెం వేడిగా ఉన్న పదార్థాల్లో కలిపి వాడుకోవాలి.
ఖర్జూరాలు: ఖర్జూరాలు (డేట్స్), డేట్ సిరప్ సహజంగా తీపి కలిగినవి. వీటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చకెర శోషణను నెమ్మదింపజేస్తాయి. లడ్డూలు, ఎనర్జీ బాల్స్ తయారీలో ఇవి బాగా ఉపయోగపడతాయి.
కొబ్బరి చకెర: దీన్ని సాధారణ చకెరలా ఉపయోగించుకోవచ్చు. ైగ్లెసెమిక్ ఇండెక్స్ తకువగా ఉండటంతో బేకింగ్‌లో విస్తృతంగా దీనిని వాడుతున్నారు.
మేపిల్ సిరప్: మేపిల్ సిరప్ భారతీయ వంటల్లో సంప్రదాయ పదార్థం కాకపోయినా ఇప్పుడు ఆరోగ్యకరమైన స్వీట్నర్గా ప్రాచుర్యం పొందింది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. తకువ పరిమాణంలోనే ఎకువ తీపి ఇస్తుంది.
స్టీవియా: స్టీవియా అనే మొక నుంచి తీసిన స్వీట్నర్లో కేలరీలు అస్సలు ఉండవు. మధుమేహం ఉన్నవారికి ఇది అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వల్పంగా చేదును కూడా కలిగి ఉంటుంది.
మోంక్ ఫ్రూట్ స్వీట్నర్: స్టీవియాతో పోలిస్తే రుచిలో కొంచెం మెరుగ్గా ఉంటుంది. పండ్ల ప్యూరీలను కూడా సహజ స్వీట్నర్లుగా ఉపయోగించవచ్చు. పండిన అరటి, మామిడి, ఆపిల్ ప్యూరీలు మిఠాయిల్లో చకెర వాడకాన్ని తగ్గిస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

