నగరాలు, పల్లెల్లోని వీధుల్లో విహరిస్తూ.. అక్కడి ప్రజలు, వారి జీవితం, సంస్కృతిని ఫొటోలు తీయడమే.. స్ట్రీట్ ఫొటోగ్రఫీ. ఆయా సందర్భాల్లో అనుకోకుండా దొరికే అద్భుతమైన క్షణాలను కెమెరాల్లో బంధించే అద్భుతమైన కళ ఇది. మొబైల్ ఫోన్‌తోనే వీధుల ప్రత్యేకతలను, వాటిఅందాలను అత్యద్భుతంగా చిత్రీకరించవచ్చు.
స్ట్రీట్ ఫొటోగ్రఫీకి సంబంధించి.. ఉత్తమ టెక్నిక్స్, కెమెరా సెట్టింగ్స్, కంపొజిషన్ ఐడియాలు, ఎడిటింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా మీరు స్ట్రీట్ ఫొటోలను ప్రొఫెషనల్ స్థాయిలో తీయగలిగేలా తయారవుతారు. స్ట్రీట్ ఫొటోగ్రఫీ అంటే నగరాలు, పల్లెల జీవనశైలి, వీధుల సంస్కృతి, ప్రజల భావోద్వేగాలు, ఆర్చిటెక్చర్ వంటి అంశాలను సహజమైన రీతిలో ఫొటోలు తీయడమే. ఇది అక్కడి ప్రజల నిజమైన కథనాలను చెప్పే ఒక మాధ్యమం. నగరంలో అనుకోని సంఘటనలు, బిజీబిజీగా ఉండే వీధులు, ట్రాఫిక్, గుళ్లు, బజార్లు మొదలైన వాటిని ఫొటోల్లో బంధించవచ్చు. స్ట్రీట్ ఫొటోగ్రఫీ ఎక్కువగా నేచురల్, కాండిడ్ షాట్స్‌పై ఆధారపడుతుంది. మనం తీసే స్ట్రీట్ ఫొటోలు ఒక మంచి కథను చెప్పగలగాలి. మరి అలాంటి స్ట్రీట్ ఫొటోగ్రఫీకి ఎలాంటి సెట్టింగ్స్ వాడితే మంచిది? పదండి తెలుసుకుందాం.
– ఆడెపు హరికృష్ణ