కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్ను బట్టి.. రక్తంలో కలిసిపోతాయి. ఫలితంగా, కొందరిలో అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ‘ఒ’ బ్లడ్ గ్రూప్ (పాజిటివ్/ నెగెటివ్) ఉన్నవారిలో ఈ లెక్టిన్ల వల్ల కడుపు పూతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ‘ఎ’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయట. దీనిని నివారించడానికి ‘బ్లడ్ గ్రూప్ డైట్’ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
‘ఎ’ బ్లడ్ గ్రూప్ : ఎ బ్లడ్‌గ్రూప్ (పాజిటివ్/ నెగెటివ్) రక్తం ఉన్నవారు.. పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కోడిగుడ్లు, క్యారెట్, గుమ్మడికాయ, ద్రాక్ష, బ్రకోలీ, బ్లూ బెర్రీస్, ఆప్రికాట్, చెర్రీస్.. వీరి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. టమాట, వంకాయ, గోధుమలు, మక్కజొన్న, పాల ఉత్పత్తులను తక్కువగా తినాలి.
‘బి’ బ్లడ్ గ్రూప్ : మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, కిడ్నీ బీన్స్‌తోపాటు ఆవు పాలు.. ‘బి’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మంచిది. చికెన్, మక్కజొన్న, గోధుమ, టమాటాలు, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్లు, సోయా ఉత్పత్తులను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
‘ఎబి’ బ్లడ్ గ్రూప్ : ‘ఎబి’ రక్తం ఉన్నవారికి కడుపులో ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాబట్టి, కెఫిన్, ఆల్కహాల్, వేపుళ్లకు వీరు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు, టోఫు, చేపలు, రొయ్యలు లాంటి సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఆకుపచ్చ కూరగాయలు కూడా వీరికి మేలు చేస్తాయి. గుడ్లు, పాలు, పెరుగు, వెల్లుల్లి, అంజీర్, వాల్నట్, పుచ్చకాయలను ఎక్కువగా తినాలి.
‘ఒ’ బ్లడ్ గ్రూప్ : అధిక ప్రొటీన్ కలిగిన ఆహారం.. వీరికి మంచిది. చికెన్, మటన్, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండితో తయారైన పదార్థాలు, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తింటే మంచిది.