నలుగురు ఫ్రెండ్స్ ఒక పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు దోస్తుల ముచ్చట్లు అన్నీ సోషల్ అడ్డాలోనే. ఈ క్రమంలో అన్ని సోషల్ మీడియా వేదికలూ నిత్యం సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ టీన్స్ను తమవైపు తిప్పుకొంటున్నాయి. యూజర్లను మరింత ఎంగేజ్ చేయడానికి ఇన్‌స్టా నయా ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇన్‌స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఒంటరిగా చూస్తూ బోర్‌గా ఫీల్ అవుతున్నారా? మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక స్పెషల్ రీల్ ఫీడ్ క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ కలిసి రీల్స్ చూస్తూ చాట్ చేయొచ్చు. అంతేనా, గ్రూప్‌లో అందరూ కలిసి ఏదైనా కొత్త ట్రెండ్ చేస్తూ దానిపై డిబేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన బ్లెండ్ (Blend) ఫీచర్‌తో అంతా సాధ్యమే!
నేటి జెన్-జీ యువతకు అభిప్రాయాల్ని పంచుకోవడం నిత్య వ్యవహారంగా మారిపోయింది. అందుకే దోస్తులు ఎవరు ఎక్కడున్నా నిత్యం సోషల్ వేదికలపై యాక్టివ్‌గా ఉంటున్నారు. అందుకే ఇన్‌స్టా ఈ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీంతో మీ ఫ్రెండ్స్‌తో, గ్రూప్ చాట్స్‌లో ఒక ప్రైవేట్ రీల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీడ్‌లో ఇన్స్టాగ్రామ్.. మీకు, మీ ఫ్రెండ్స్‌కు ఇష్టమైన రీల్స్‌ని ఆటోమెటిక్‌గా సెలెక్ట్ చేసి చూపిస్తుంది. అలాగే కొత్త కంటెంట్‌ని మీ ఫ్రెండ్స్‌తో కలిసి డిస్కవర్ చేసే చాన్స్ కూడా ఉంది.
కలిసి ఊసులు పంచుకోవచ్చన్నమాట! మీ ఫ్రెండ్స్ ఇష్టాయిష్టాలను, వాళ్లు ఎలాంటి కంటెంట్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవచ్చు. దీనివల్ల మీ దోస్తానా మరింత బలపడే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒంటరిగా స్వైప్ చేస్తూ.. వేలు నొప్పి తెచ్చుకోకుండా, ఫ్రెండ్స్‌తో కలిసి జోష్‌ఫుల్‌గా నయా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చన్నమాట! ‘బ్లెండ్ ఫీచర్ యూజర్ల మధ్య ఎక్కువ కనెక్షన్ తీసుకొస్తుంది. షేర్ చేసుకునే కంటెంట్ గురించి మాట్లాడుకునే అవకాశం ఇస్తుంది. దీంతో మీ ఫ్రెండ్స్‌తో అప్ టు డేట్‌గా ఉండొచ్చు’ అంటున్నాడు ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసేరి.
Instagram Blend ఫీచర్‌ని ఉపయోగించడం చాలా సులభం. ఈ ఫీచర్ బీటా వెర్షన్లో ఎప్పటినుంచో ఉన్నదే! ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్‌తో గానీ, గ్రూప్‌తో గానీ ఉన్న DM (డైరెక్ట్ మెసేజ్)కి వెళ్లాలి. అక్కడ చాట్‌లో పైన కుడివైపు Blend అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. తర్వాత ‘Invite’ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేసి మీ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయొచ్చు. వాళ్లు మీ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేస్తే… మీకు, మీ దోస్తులకు ఇష్టమైన రీల్స్ సెలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఫీడ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫీడ్‌లో స్క్రోల్ చేస్తూ రీల్స్ చూడొచ్చు! మీ ఫ్రెండ్స్‌తో రియాక్ట్ అవ్వొచ్చు. రిైప్లె బార్ ఉపయోగించి చాట్ చేయొచ్చు. ఈ బ్లెండ్ ఫీడ్ రోజూ కొత్త రీల్స్ అప్డేట్ చేస్తుంది. దీంతో రోజూ కొత్త కంటెంట్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు! Blend ఫీచర్‌ని ఉపయోగించి ఇన్స్టాగ్రామ్ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత ఫన్‌గా, సోషల్‌గా మార్చేసుకోండి.
Instagram Blend ఫీచర్ Spotify లాంటి ఇతర యాప్‌లతో పోటీపడేందుకు ఇది మంచి ప్రయత్నం. Spotifyలోనూ Blend ప్లేలిస్ట్ ఫీచర్ ఉంది. అది ఫ్రెండ్స్‌తో మ్యూజిక్ షేర్ చేసుకునే అవకాశం ఇస్తున్నది. Instagram Blend కూడా అలాంటి కాన్సెప్టే అనుకోవచ్చు, కానీ ఇది రీల్స్ కోసం అన్నమాట. ఈ ఫీచర్‌తో యూజర్లని ఎక్కువసేపు యాప్‌లో ఉంచేలా, సోషల్‌గా ఎంగేజ్ చేసేలా ఇన్స్టాగ్రామ్ ప్లాన్ చేసిందన్నమాట!