కొందరు చీటికీమాటికీ ముఖం కడుక్కుంటారు. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ.. ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇలా చేస్తే మురికి తొలగిపోతుందనీ, మొటిమలు తగ్గుతాయని భావిస్తారు. అయితే ఇలా పదేపదే ముఖం కడుక్కోవడం చర్మానికి మంచిది కాదని స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు.
చలికాలంలో పదేపదే ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుంది. ప్రతిసారీ సబ్బును వాడటం వల్ల చర్మం.. సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అంతేకాకుండా.. ముఖం కడుక్కోవడం, టవల్‌తో తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.
గరుకుగా మారడంతోపాటు చిరాకు పుడుతుంది. అలాకాకుండా ఉండాలంటే, రోజుకు రెండుసార్లు.. ఉదయం, రాత్రిపూట ముఖం కడుక్కుంటే సరిపోతుంది. అదికూడా నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట ముఖం కడుక్కోవడానికి ముందు మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. ముఖాన్ని బాగా కడిగి.. మృదువైన టవల్‌తో తుడుచుకుంటే మంచిది. ఇక చర్మ సంరక్షణ కోసం.. ఉదయం మాయిశ్చరైజర్, రాత్రి వేళ నైట్ క్రీమ్ రాసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పకుండా అప్లయి చేసుకోవాలి.