ఇంటిని శుభ్రంగా ఉంచడం తమ కర్తవ్యంగా భావిస్తారు అతివలు. నిద్ర ముంచుకొస్తున్నా.. పడుకునే ముందు వంటింటిని చక్కగా సర్దుకొని పడుకోవడం రివాజు. అయితే, అన్ని పనులు ఒకెత్తు.. సింకు శుభ్రం చేయడం మరో ఎత్తు. ఎంత కడిగినా.. నాలుగు రోజులకే సింకు అంచుల వెంబడి జిడ్డు పేరుకుపోతుంది. ఈ చిట్కాలు పాటించడంవల్ల సింక్ మురికిని తేలికగా తొలగించవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం..
సింకు శుభ్రంగా ఉండటానికి కొన్ని రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సింక్‌లో వేడి నీరు పోసి కాసింత డిటర్జెంట్ పౌడర్ గానీ, బ్లీచింగ్ పౌడర్ గానీ వేసి ఐదు నిమిషాల తర్వాత కడగాలి.
వెనిగర్, బేకింగ్‌సోడా, నిమ్మరసం కలిపి సింక్ మొత్తం చల్లాలి. అరగంట తర్వాత వేడినీటితో శుభ్రం చేయాలి. సింక్ శుభ్రం చేసినప్పుడు చివరగా డెటాల్, ఫినాయిల్ వంటి ఘాటైన క్లీనర్‌ని రంధ్రంలో వేస్తే పైప్‌లో ఉండే సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి.