సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలోనూ సబ్జా గింజలు ముందుంటాయి.
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలోనూ సబ్జా గింజలు ముందుంటాయి.
చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయడంలో సబ్జా గింజలు సమర్థంగా పనిచేస్తాయి. వీటిలో సహజంగా ఉండే డీటాక్స్ గుణాలు.. చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటికి పంపిస్తాయి. దాంతో చర్మం కాంతిమంతంగా మారుతుంది. మొటిమలూ తగ్గుముఖం పడతాయి.
తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్‌తో నిండిన సబ్జా గింజలు.. ఆకలిని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సాయపడతాయి.
సబ్జా గింజల్లో ఉండే యాంటి బయోటిక్, యాంటి ఫంగల్, యాంటి మైక్రోబియల్ లక్షణాలు.. చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇందుకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. సబ్జాలో ఉండే చర్మ స్థితిస్థాపక లక్షణాలు.. చర్మం త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.
చర్మానికే కాదు.. జుట్టుకూ సబ్జా గింజలు మంచి పోషణ అందిస్తాయి. వీటిలో అధికంగా లభించే విటమిన్ కె, బీటా కెరోటిన్, ఇతర ప్రొటీన్లు.. జుట్టు, కుదుళ్లు దృఢంగా ఉండేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.