పెరటి తోటల్లో ఆకు కూరలు, కూరగాయలతోపాటు ఎక్కువగా కనిపించేవి పూల మొక్కలే! అందులోనూ గులాబీలను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి ఇంటికి కొత్త అందాన్ని ఇవ్వడంతోపాటు ఆడవాళ్లకూ అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. ఆకులే తప్ప గులాబీలు కనిపించవు. అలా కాకుండా, చెట్టు మొత్తం విరగబూయాలంటే.. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.