లక్షలు పోసి కారు కొంటాం. మనం వాడుకుంటూనే.. అవసరానికి ఏ ఫ్రెండుకో.. అద్దెకో ఇస్తుంటాం. అలాంటప్పుడు కారు ఎక్కడుందో.. ఏ రూటులో వెళ్తున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే? సింపుల్.. ఓ జీపీఎస్ ట్రాకర్‌ని వాడేస్తే సరి. అలాంటిదే ఈ రాక్టెక్ మినీ మాగ్నెటిక్ జీపీస్ ట్రాకర్. సురక్షితమైన చోట దీన్ని అతికించి కారును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. ఇందులో బిల్ట్ ఇన్- మైక్రోఫోన్తోపాటు యాంటి థెఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఈ సదుపాయాన్ని వాడుకునేందుకు ట్రాకర్ లోపల యాక్టివేట్ చేసిన సిమ్ కార్డును ఇన్సర్ట్ చేయాలి. దీన్ని కారుతోపాటు సూట్‌కేసులు, పిల్లల స్కూల్ బ్యాగులకూ అమర్చుకోవచ్చు. దీంట్లో గూగుల్ మ్యాప్స్ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు.
ధర: రూ.2,999
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
ఒకటా.. రెండా.. మినిమమ్ మూడు చార్జర్లు నిత్యం అందుబాటులో ఉంచుకోవాల్సిందే. ఒకటి స్మార్ట్‌ఫోన్ చార్జర్.. ఇంకోటి స్మార్ట్‌వాచ్ కోసం.. మరొకటి ఇయర్ ఫోన్స్‌కి. అయితే, ఈ చార్జర్లను వాడే క్రమంలో పిన్స్ అడ్డదిడ్డంగా వదిలేయకుండా.. ఓ పద్ధతి ప్రకారం టేబుల్ దగ్గర సెట్ అయ్యేలా చేస్తే!! ఇదిగోండి కావాలంటే… SOULWIT Cable Holder క్లిప్స్‌ని చూడండి. వీటిని చక్కగా టేబుల్‌కి సెట్ చేసుకుంటే చాలు. అన్ని పిన్స్నీ చక్కగా క్రమపద్ధతిలో అమర్చుకుని చార్జ్ పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో టేబుల్ పక్కన పిన్ ఎక్కడుందా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇంటర్నెట్ కేబుల్, డేటా కేబుల్, మౌస్ కేబుల్, ఆడియో కేబుల్స్‌ని కూడా కేబుల్ హోల్డర్‌లో సెట్ చేసుకోవచ్చు. మీ వర్క్ స్పేస్‌కి అనువుగా హోల్డర్ని అతికించుకోవచ్చు. అవసరమైతే కారులోనూ అమర్చుకోవచ్చు.
ధర: రూ.1,000
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
బుక్ రీడింగ్ అలవాటు ఉన్నవారికి టైమ్‌తో సంబంధం ఉండదు. ఎప్పుడైనా చదివేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే, రాత్రి సమయంలో చదివేటప్పుడే గదిలో లైట్ కారణంగా ఇతరులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా బుక్ రీడింగ్ చేసేందుకు LED Light Panel Light Wedge Reading ల్యాంప్‌ని ప్రయత్నించొచ్చు. ఈ పోర్టబుల్ లైట్‌ని పుస్తకానికి అమర్చుకుని హాయిగా చదువుకోవచ్చు. ఒక్కో పేజీని లైటు వెలుతురులో చూపిస్తుంది. ఎవరైనా మన పక్కనే నిద్రపోతున్నా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అంతలా ఈ ప్యానల్ లైట్‌ని తీర్చిదిద్దారు. ప్రయాణాల్లో దీన్ని ఎక్కడికైనా పుస్తకంతోపాటే తీసుకెళ్లొచ్చు. బ్యాటరీ పవర్ సోర్స్ ద్వారా ఇది పనిచేస్తుంది.
ధర: రూ.599
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
రోజువారీ లైఫ్ ైస్టెలో కొన్ని పనులకు టైమర్ పెట్టుకోవడం అలవాటుగా మారిపోతున్నది. అలాంటి అలవాటు ఉన్నవాళ్లు టైమర్ కోసం ఫోన్‌ని వెతకాల్సిన పనిలేదు. ఇదిగో ఈ టైమర్‌ను అందుకోండి చాలు. దీని పేరేంటంటే.. OVIOL Stopwatch Timer. ఎల్సీడీ డిస్ప్లే, మూడు బటన్స్‌తో టైమర్‌ని వాడుకోవచ్చు. అలాగే, టైమ్‌ని సెట్ చేసేందుకు ప్రత్యేక కంట్రోల్స్ ఉన్నాయి. రెండు రకాలుగా అలారం పెట్టుకోవచ్చు. అలారం ట్యూన్స్‌తోపాటు.. ఫ్లాష్ లైట్ మోడ్‌ని యాక్టివేట్ చేయొచ్చు. కావాలంటే.. ఫ్లాష్ లైట్‌ని మ్యూట్ చేసుకోవచ్చు కూడా. టైమర్‌లో ‘కౌంట్ అప్, కౌంట్ డౌన్’ మోడ్స్ ఉన్నాయి. పిల్లలు చదువుకునేటప్పుడు.. కంప్యూటర్, ఫోన్లు వాడేటప్పుడు టైమర్‌ని పెట్టుకోవచ్చు. దీంతో స్క్రీన్ టైమ్‌ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే, పెద్దలు యోగా, వ్యాయామం చేసేటప్పుడు కూడా ఈ టైమర్ పెట్టుకోవచ్చు.
ధర: రూ.999
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్