రాజా రవివర్మ ప్రాణంపోసిన చిత్రాల్లో అపార ఆదరణ పొందిన కళాఖండం.. దమయంతి. ఆ వర్ణచిత్రంలో దమయంతి, ఆమె చుట్టూ ఉండే పరిచారికలు కట్టుకున్న చీరలు రాజసాన్ని ఒలకబోస్తుంటాయి. ఆ స్ఫూర్తితో ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత డిజైనర్ అంజు మోదీ ‘దమయంతి’ పేరిట సరికొత్త కలెక్షన్ తీసుకొచ్చారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, మాధురీ దీక్షిత్, టబులాంటి సెలెబ్రిటీలు మెచ్చిన డిజైనర్ తను. రవివర్మ గీసిన చిత్రాలంటే తనకెంతో ఇష్టమనీ, అందులోనూ దమయంతి స్ఫూర్తితో చీరలు తయారు చేయాలన్నది తన చిరకాల స్వప్నమనీ చెబుతారు అంజు.
దమయంతి హంసతో మాట్లాడుతున్నట్టు ఉండే రవివర్మ ప్రఖ్యాత పెయింటింగ్‌లోని చీరనూ ఈ కలెక్షన్లో భాగంగా డిజైన్ చేశారు. మరింత సహజత్వం కోసం చీర తయారీలో చెక్కగుజ్జును ఉపయోగించారు.