Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)) అభిమానులకు గుడ్‌న్యూస్. కనుమ పండుగ సందర్భంగా ప్రభాస్ 25వ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన థియోటర్లోకి రానుందని సందీప్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఈ పాన్ ఇండియా డైరెక్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’తో కొత్త ఒరవడి సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈసారి రెబల్ స్టార్ 25వ సినిమాతో వస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న స్పిరిట్‌పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్, పాన్ ఇండియా స్టార్ కలయికలో వస్తున్న మూవీ కావడంతో హైప్ మామూలుగా లేదు.
Spirit release date 🙂#Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026
డిసెంబర్31న “ఇండియన్ సినిమా.. మీ అజానుబాహుడిని చూడు. ఆజానుబాహు.. హ్యాపీ న్యూ ఇయర్ 2026” అంటూ స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పెట్టారు సందీప్ రెడ్డి. ఈసారి కనుమ సందర్భంగా సినిమా విడుదల తేదీని వెల్లడించారు డైరెక్టర్. కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.
#Spirit – 5th MARCH 2027
Mar 05 – Friday
Mar 06 – Saturday/Maha Shivaratri
Mar 07 – Sunday
Mar 09- Tuesday/Eid5 days long weekend… Just imagine the box office carnage 📈📈🔥🔥💥💥 #Prabhas pic.twitter.com/LeHNBWIrse
— Prabhas RULES (@PrabhasRules) January 16, 2026
పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న స్పిరిట్‌ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన వంటి ప్రముఖలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.