న్యూయార్క్: పురుషులు గర్భం దాల్చుతారా అని అమెరికా సేనేటర్ జోష్ హౌలే ప్రశ్న వేశారు. అబార్షన్ మాత్రల గురించి జరిగిన సేనేట్ హౌజ్ కమిటీ మీటింగ్‌లో ఆయన ఈ ప్రశ్న అడిగారు. భారతీయ సంతతికి చెందిన ప్రసూతి వైద్యురాలు నిషా వర్మ(Nisha Verma)ను ఆయన ఈ ప్రశ్న పదేపదే అడిగారు. సుమారు 14 సార్లు ఆయన ఈ ప్రశ్న వేశారు. జార్జియా, మసాచుసెట్స్ లో ఆమె పునరుత్పత్తి హెల్త్‌కేర్ డాక్టర్‌గా చేస్తున్నారు.
రిపబ్లికన్ సేనేటర్ సంధించిన ఆ ప్రశ్నకు చాలా ధీటుగా సమాధానం ఇచ్చింది డాక్టర్ నిషా. పురుషులు గర్భం దాల్చుతారా అని సేనేటర్ జోష్ ఎన్ని సార్లు ప్రశ్నించినా.. ఆ ప్రశ్నకు నేరుగా అవును లేదా కాదు అన్న సమాధానం ఇవ్వలేదు. కానీ డాక్టర్ నిషా వర్మ మాత్రం ఆ సేనేటర్ ఉద్దేశాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఆ ప్రశ్న వెనుక లక్ష్యం ఏంటో తనకు తెలియడంలేదన్నారు.
తాను వేసిన ప్రశ్న .. జీవం, శాస్త్రానికి చెందినదని, బయోలజీ ప్రకారం పురుషులు ప్రెగ్నెంట్ అవుతారా అని ఆయన మళ్లీ మళ్లీ అడిగారు. అయితే సైన్స్, ఆధారాలు అనేవి చికిత్సకు మార్గాన్ని ఇవ్వాలని డాక్టర్ వర్మ తెలిపారు. ఇలాంటి ఎస్ ఆర్ నో ప్రశ్నలు రాజకీయ పరికరాలు అని ఆమె అన్నారు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
SPOILER ALERT: Men cannot get pregnant pic.twitter.com/08JwHUlxIj
— Josh Hawley (@HawleyMO) January 14, 2026