‘చుండ్రు’ అనేది మనుషుల్లోనే కాదు.. పెంపుడు జంతువుల్లోనూ కనిపిస్తుంది! అయితే, ఇది మామూలు సమస్య అనుకుంటే పొరపాటే! పొడి చర్మం, అలర్జీలు, పౌష్టికాహారలోపం, ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. సమస్యకు మూలాన్ని గుర్తించి సరైన చికిత్స అందించినప్పుడే.. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి.