రోజంతా ఇ-మెయిల్స్‌కు రిైప్లె ఇస్తూ సమయం వృథా చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త ఏఐ టూల్ మీ ఇ-మెయిల్స్‌ను మీలాగే రాసి.. ఆఫీస్ పనిని సులభతరం చేస్తుంది! అదెలా అంటారా? అందుకు Perplexity ఓ కొత్త ఇ-మెయిల్ అసిస్టెంట్‌ని లాంచ్ చేసింది. ఈ ఏఐ టూల్ యూజర్లు తమ మెయిల్ బాక్స్‌ని సమర్థంగా నిర్వహించుకోవడానికి, డ్రాఫ్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం Perplexity Max సబ్‌స్ర్కైబర్లకు అందుబాటులో ఉంది.
ఇది Gmail, Outlook లాంటి ప్రముఖ ఇ-మెయిల్ సర్వీసులతో సింక్ అయ్యి పనిచేస్తుంది. ఈ అసిస్టెంట్ కేవలం ఆటోమేటిక్ రిైప్లెలు మాత్రమే ఇవ్వదు. ఇది యూజర్ సంభాషణ శైలిని, టోన్‌ను నేర్చుకుంటుంది. అంటే, మీ వ్యక్తిగత ైస్టెల్లోనే పర్సనలైజ్డ్ రిైప్లెలు తయారుచేస్తుంది.
మీ క్యాలెండర్ ఆధారంగా, మీ షెడ్యూల్‌కు సరిపోయే మీటింగ్ సమయాలను కూడా సూచిస్తుంది. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దీన్ని వాడటం చాలా సులభం. మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఖాతా నుంచి assistant@perplexity.comకు ఒక మెయిల్ పంపితే చాలు. టూల్ లింక్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ముఖ్యమైన మెయిల్స్‌ను ముందుగా చూపిస్తుంది. గ్రూప్ మెయిల్స్‌ను ఆర్గనైజ్ చేస్తుంది. అంతేకాదు, మీ ఇన్‌బాక్స్ గురించి కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు ‘బోర్డు మీటింగ్ ముందు నేను ఏ మెయిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి?’ అని అడిగితే ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లో సేకరించి చెబుతుంది.