సంక్రాంతి పండుగ నాడు సంప్రదాయాలు వాకిట్లోనే స్వాగతం చెబుతాయి. ఇంట, వంట అనే కాదు… ఆహార్యంలోనూ ఆ అందం ఉట్టిపడుతుంది. ఆ తెలుగింటి శోభను కళ్లకు కట్టేలా ఎరుపు, ఆకుపచ్చ వన్నెల్లో ముచ్చటైన నారాయణపేట లంగావోణీ రూపుదిద్దుకుంది.
లంగాకు వచ్చిన పెద్ద జరీ అంచు పండుగ నిండుదనాన్ని తెలియజేస్తున్నది. దీనికి జతైన ఓణీకి తగ్గట్టు చిన్నోడికీ ఆకుపచ్చ రంగు మ్యాచింగ్ పంచె అమరింది. ఓణీకి వచ్చిన లేసును చొక్కాకూ జోడించి… తల్లీకొడుకుల ఫ్యాషన్ సంప్రదాయానికి తెరదీశారు డిజైనర్.