కొత్త ఏడాది కొత్తగా కనిపించాలనుకుంటే.. ఇదిగో ఇలాంటి కొత్త డిజైన్లు ఎంచుకోండి. అందానికి అందం, సౌకర్యానికి సౌకర్యం.
గులాబీ అందం
లేత గులాబీ రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. బాడీ పార్ట్‌లో రంగుదారాలు, పూసలతో అల్లిన పూలు, సీతాకోకచిలుకలు మగ్గం వర్క్ చేశారు. ఓపెన్ షోల్డర్స్‌ను నెక్ లైన్‌తో జతచేసి డోరీ పైపింగ్ చేశారు. గతేర్స్తో నెక్లైన్, షోల్డర్స్ హైలైట్ చేశారు. బాటమ్‌కు ప్రిల్స్ ఇచ్చి వైర్ పీకో చేయడంతో బౌన్సీ లుక్ వచ్చింది. ఫ్లీట్స్ ట్రెండీగా ఉన్నాయి.
ముత్యాల మెరుపుతో
గోధుమ రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. డబుల్ షేడ్ కోసం ముదురు రంగు డై చేశారు. బాడీ పార్ట్ హైలైట్ అయ్యేలా మగ్గం వర్క్‌లో ముత్యాలు పొదిగి.. అందమైన పక్షుల జంటను కూర్చారు. వీ నెక్, ఫుల్కట్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఇవ్వడం బావుంది. బాటమ్‌లో రెండు లేయర్లలో ప్రిల్స్, గతేర్స్తోపాటు వైర్ పీకో చేయడంతో వేవ్లుక్ వచ్చింది. చేతులకు సైతం ప్రిల్స్తో పట్టీలు ఇవ్వడంతో ైస్టెలిష్‌గా అనిపిస్తున్నది.
రితీషా రెడ్డి ఇషా డిజైనర్ హౌస్, follow us on: retheshaareddy/ instagram.com, 8500028855, 7013639335