New study: వృద్ధులు నిత్యం ఆ పని చేస్తే.. టైప్-2 మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చట..!
New study: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్తగా 15 లక్షల మంది మధుమేహం బారినపడుతున్నారు. అందులో దాదాపు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంటున్నారు. కాబట్టి వృద్ధులంతా రోజుకు కనీసం

కాలిఫోర్నియా: రోజులు మారుతున్నాకొద్ది కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగ్గట్టే మందులూ తయారవుతున్నాయి. కొత్తకొత్త చికిత్సలూ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ఏ రోగానికైనా కేవలం మందులు వాడటం, వైద్య చికిత్స తీసుకోవడం ఒక్కటే శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. వాటితోపాటు శారీరక వ్యాయామమూ అవసరమని సూచిస్తున్నారు. అందులోనూ నడక మరీ మంచిదంటున్నారు.
తాజాగా జరిగిన ఓ అధ్యయనంలోనూ అదే నిజమని తేలింది. వృద్ధుల్లో మధుహేహం రిస్క్ ఎలా మారుతుంది..? దానిపై నడక ప్రభావం ఏమాత్రం ఉంటుంది అనే కోణంలో ఈ కొత్త అధ్యయనం జరిగింది. 70 నుంచి 80 ఏండ్ల మధ్య వయసు కలిగిన వృద్ధులు నిత్యం నడవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ సమస్య తగ్గుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు డయాబెటిస్ కేర్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి.
65 ఏండ్లు దాటిన వృద్ధులపై పరిశోధన..
ఒక వృద్ధుడు లేదా వృద్ధురాలు తను రోజూ నడిచేదానికంటే ఒక వెయ్యి అడుగులు ఎక్కువ నడిస్తే డయాబెటిస్ రిస్క్ 6 శాతం తగ్గుతుందని రిసెర్చర్స్ తెలిపారు. అందువల్ల రోజుకు 2000 అడుగులు అదనంగా నడవగలిగితే టైప్-2 డయాబెటిస్ రిస్క్ 12 శాతం తగ్గుతుందని తేల్చారు. మధుమేహం లేని 65 ఏండ్ల పైబడిన వృద్ధులను ఈ పరిశోధన కోసం ఎంచుకున్నారు. వారి కుడి తుంటిపై యాక్సిలరోమీటర్లను అమర్చారు. వారంరోజులపాటు రోజూ 24 గంటలచొప్పున వాటిని తీయకుండా ఉంచుకోవాలని సూచించారు.
ఆ తర్వాత ఏడు సంవత్సరాలపాటు వారి ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే రోజూ ఎక్కువ అడుగులు వేసిన వారిలో చాలా తక్కువ మంది మధుమేహం బారినపడ్డారు. కానీ, చాలా తక్కువగా నడిచిన వారిలో ఎక్కువ మందికి టైప్-2 డయాబెటిస్ వచ్చింది. దాన్నిబట్టి వృద్ధుల్లో నడకకు, మధుమేహానికి సంబంధం ఉన్నదని పరిశోధకులు తేల్చారు. మొత్తం 4,838 మందిపై పరిశోధన చేయగా.. వారిలో 395 మంది అంటే 8 శాతం మంది డయాబెటిస్ బారినపడ్డారు.
ఏటా 15 లక్షల మందికి టైప్-2 డయాబెటిస్..
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్తగా 15 లక్షల మంది మధుమేహం బారినపడుతున్నారు. అందులో దాదాపు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంటున్నారు. కాబట్టి వృద్ధులంతా రోజుకు కనీసం 2000 అడుగుల చొప్పున నడిస్తే వారిలో మధుమేహం రిస్క్ 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. ఐదు లక్షల మందిలో 12 శాతం అంటే ఏటా 60 వేల మందిని నడక ద్వారా మధుమేహం బారినపడకుండా కాపాడవచ్చని అంచనా వేశారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

