గోళ్లరంగు నెయిల్ ఆర్ట్‌గా మారి చాలా కాలమైంది. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో పరిగెత్తే ఫ్యాషన్‌కి పిల్లకాలువలా తయారైంది. ఇప్పుడు చెర్రీపండ్ల అందాన్నీ సంతరించుకుని సరికొత్తగా ముస్తాబవుతున్నది.
ఇన్స్టాగ్రామ్ సహా చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్లంతా ‘చెర్రీ నెయిల్స్’కే ఓటేస్తున్నారు. ఆకుపచ్చ ఆకులు, తొడిమెలతో ఎర్రటి చెర్రీ పండ్లు గోళ్ల మీద మెరుస్తు న్నాయి. మావీ పండంటి గోళ్లే అనిపించుకోవాలంటే ఈ ట్రెండ్ ఫాలో కావాల్సిందే!