డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ రెగ్యులర్‌గా వాడుతుంటే.. కీబోర్డుపై చాలా చెత్త చేరిపోతుంది. చేతికి ఏది దొరికితే దానితో క్లీన్ చేయాలని చూస్తే.. కచ్చితంగా పాడవుతుంది. కీబోర్డులో మీటలు ఊడిపోతాయి. అలాంటప్పుడు సింపుల్‌గా Sounce 5-in-1 మల్టీ ఫంక్షన్ క్లీనింగ్ కిట్‌ను వాడేస్తే సరిపోతుంది. చూసేందుకు సింపుల్‌గానే ఉన్నా.. పని మాత్రం ఐదు రకాలుగా చేస్తుంది. నైలాన్ బ్రష్‌తో కీబోర్డ్‌లో దాక్కున్న దుమ్మును బయటికి లాగేస్తుంది. ఫ్లాకింగ్ స్పాంజ్‌ని తీసుకుని ఇయర్‌బడ్స్, చార్జింగ్ కేస్లలోని మురికిని తుడిచేయొచ్చు.
మెటల్ పెన్ టిప్‌తో కీబోర్డులోని మీటల మధ్య పేరుకుపోయిన ధూళిని తొలగించొచ్చు. కీబోర్డులోని మీటల కింద కూడా ఏదైనా దుమ్మూధూళీ ఇరుక్కుంటే.. అక్కడ క్లీన్ చేసేందుకు ‘కీ క్యాప్ పుల్లర్’ ని వాడొచ్చు. ఇది కేవలం కీబోర్డ్ క్లీనింగ్‌కే కాదు. ఇయర్‌ఫోన్స్, చార్జింగ్ కేసులు, కెమెరా లెన్స్‌లు, ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు.. అన్నింటినీ డీప్క్లీన్ చేసేస్తుంది. ఒక్క బ్రష్‌లో ఐదు సొల్యూషన్స్ అన్నమాట!
ధర: రూ.499
దొరుకుచోటు: అమెజాన్.కామ్
రాత్రివేళ చీకట్లో సైకిల్ తొక్కడం అంత ఈజీ కాదు. ముందు రోడ్డు కనిపించదు.. వెనుక వాహనాలకు మీరు కనిపించరు. అలాంటి సందర్భాల్లో Gadget Deals 2-in-1 రీచార్జబుల్ సైకిల్ లైట్-హార్న్‌ని ప్రయత్నించొచ్చు. ముందు బ్రైట్ LED లైట్.. వెనక టెయిల్ లైట్ ఉండటంతో క్లియర్ విజిబిలిటీ వస్తుంది. అదనంగా ఇన్‌బిల్ట్ హార్న్‌తో సౌండ్ సిగ్నల్ కూడా అందిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టడం కూడా సింపుల్. యూఎస్బీ ద్వారా ల్యాప్‌టాప్, చార్జర్, పవర్‌బ్యాంక్ దేనితోనైనా కనెక్ట్ చేసేయొచ్చు. తేలికైన డిజైన్‌తో హ్యాండిల్‌బార్ లేదా సీటుకి సులభంగా ఫిట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే.. రాత్రి రైడ్‌కి ఇది డబుల్ సెక్యూరిటీ ప్యాక్!
ధర: రూ.1,199
దొరుకు చోటు: అమెజాన్.కామ్
ఒకటా.. రెండా.. ఇంటిల్లిపాది అనేక గ్యాడ్జెట్లు వాడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని పాతవి అయిపోతుంటాయ్. అయినప్పటికీ కొత్త వాటితో కలిపి వాడుతుంటారు. ఈ క్రమంలో ఎప్పుడైనా కొత్త ల్యాపీని పాత మానిటర్‌కు కనెక్ట్ చేయాల్సి వస్తే? లేకపోతే పాత ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేయాలంటే?.. ఏం కంగారు పడక్కర్లేదు. సపోర్ట్ లేదు కదా! అని పక్కన పడేయొద్దు. RuhZa HDMI to DVI కన్వర్టర్ ఉంటే చాలు. చిన్న డాంగిల్లా ఉండే ఈ కనెక్టర్‌ని ల్యాప్‌టాప్ HDMI పోర్ట్‌లో పెట్టి.. దాని మరోవైపు మానిటర్ DVI పోర్ట్‌లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మానిటర్ స్క్రీన్ వెంటనే పనిచేస్తుంది. దీంతో కొత్త పీసీ నుంచి పాత మానిటర్కి.. పాత కంప్యూటర్ నుంచి కొత్త టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 4K క్లారిటీ వరకూ వీడియోని సపోర్ట్ చేస్తుంది. ఈ కనెక్టర్ వీడియో వరకే. సౌండ్ కోసం వేరే స్పీకర్లు పెట్టుకోవాలి.
ధర: రూ.999
దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్.కామ్
రాత్రి సమయంలో పుస్తకాలు చదువుకోవాలంటే? కళ్లకు హాయిగా అనిపించే లైటింగ్ ఉంటే మంచిది. అంతేకాదు, రాత్రిపూట పిల్లల్ని నిద్రపుచ్చాలన్నా.. సాఫ్ట్ లైట్ కచ్చితంగా అవసరమే! అందుకు Nairo USB Voice Control LED Light సరైన సొల్యూషన్. ఇందులో 24 ప్రీమియం LED లైట్స్‌ను డబుల్ రింగ్‌లో అమర్చారు. మూడు రకాల మోడ్స్ ఉన్నాయి. వైట్, వార్మ్, మిక్స్ లైట్. 360 డిగ్రీల్లో ఫ్లెక్సిబుల్‌గా ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు. ప్రత్యేకంగా వాయిస్ కంట్రోల్ ఉండటంతో ‘ఆన్, ఆఫ్, బ్రైట్నెస్ పెంచు.. కలర్ మార్చు..’ అని కమాండ్స్ ఇస్తే చాలు, లైట్ మారిపోతుంది. ల్యాప్‌టాప్, పవర్‌బ్యాంక్, USB చార్జర్.. దేనికైనా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. తక్కువ పవర్‌తో గంటల తరబడి సేఫ్‌గా వెలుగుతుంది.
ధర: రూ.286
దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్.కామ్