అందంలో జపాన్ వనితలు ప్రత్యేకం. అందులోనూ వారి మేనిఛాయ అద్భుతం. అందుకోసం వారేమీ అంతర్జాతీయ ఉత్పత్తులను ఆశ్రయించడం లేదు. వంటింటి చిట్కాలతోనే.. ముఖవర్చస్సు పెంచుకుంటున్నారు. ఇందుకోసం ‘4-2-4’ రూల్‌ను పాటిస్తున్నారు.
ముందుగా ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ను ఉపయోగించి.. ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నాలుగు నిమిషాల పాటు ముఖంపై సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దాంతో చర్మంపై ఉండే మేకప్, నూనెలు, ఇతర మలినాలు తొలగిపోతాయి.
చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి, చర్మంపై మృత కణాలు, మలినాలను తొలగించడానికి మరో రెండు నిమిషాలు ముఖంపై మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇందుకోసం నీటి ఆధారిత క్లెన్సర్‌ను వాడాలి.
ఇక చివరగా.. రెండు నిమిషాలపాటు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మంపై ఉండే నూనెలు, దుమ్ము వదిలిపోతాయి. ఆ తర్వాత మరో రెండు నిమిషాలపాటు చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అనేక ప్రయోజనాలు నిత్యం ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. మసాజ్‌తో చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మొటిమలు తగ్గుముఖం పడతాయి. వేడి, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల.. చర్మంలో తేమ అదుపులో ఉంటుంది. చర్మం హైడ్రేట్‌గా మారి, కాంతిమంతంగా కనిపిస్తుంది.