Insect Jewellery | నవరత్నాలు గుదిగుచ్చిన ఆభరణాలు చూశాం, ఆత్మీయుల ఫొటోలూ దేవతా మూర్తులు ఇముడ్చుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకెళ్లి పురుగులను జోడిస్తున్నవారూ ఉన్నారు. ‘ఇన్సెక్ట్ జువెలరీ’ ఇప్పుడో ట్రెండ్. ఈగలు, బొద్దింకలు, తేనెటీగలు, తుమ్మెదలు, మిడతలు.. దేన్నీ వదలడం లేదు. ఇది ఇప్పటి కథ కాదు. ఈజిప్టు నాగరికతలోనే ఉందంటున్నారు చరిత్రకారులు.
గ్రీకు పురాణం ప్రకారం.. ఓ రాకుమారి శత్రు తెగకు చెందిన యువరాజును ప్రేమించింది. పెద్దలు ఆ పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో ప్రాణార్పణ చేసి.. మరుజన్మలో పురుగుగా జన్మించి.. ఆ యువరాజు ఆభరణంలో ఇమిడిపోయింది. తన ప్రేమికుడి గుండెలను ఆవాసం చేసుకుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఫ్యాషన్ల కోసం పురుగుల్ని నాశనం చేయడం అనైతికమంటూ పెటాలాంటి సంస్థలు ఆందోళన చేస్తున్నాయి.