మీ ఫిట్నెస్ను రోజూ మానిటర్ చేస్తున్నారా? జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? అందుకోసం జిమ్‌లు, ప్రత్యేక కోచ్‌ల కోసం చూస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. HUAWEI Watch Fit 3.. ఒక్కటుంటే చాలు. ఈ స్మార్ట్‌వాచే.. మీ పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌లా పనిచేస్తుంది. మీ వ్యాయామం, వర్కవుట్లను ట్రాక్ చేస్తుంది. బిల్ట్-ఇన్ జీపీఎస్‌తో రన్నింగ్ రూట్‌ను చక్కగా మ్యాప్ చేసి చూపిస్తుంది. HUAWEI స్మార్ట్ సజెషన్స్ ఫీచర్.. మీ అలవాట్లు, క్యాలరీలను ఖర్చు చేసే విధానం, వాతావరణాన్ని బట్టి.. మీకే ప్రత్యేకమైన వర్కవుట్లను సూచిస్తుంది. అంటే.. ఓ జిమ్ ట్రెయినర్లా మిమ్మల్ని గైడ్ చేస్తుంది.
మీ రోజువారీ జీవితాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తుంది. 1.82 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే, 480 X 408 పిక్సెల్స్ రిజల్యూషన్, ఎస్పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ హెల్త్ అలర్ట్స్ లాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్ ట్రాకింగ్, క్యాలరీ కౌంటింగ్, 100కు పైగా వర్కౌట్ మోడ్స్‌తో వస్తున్నది. ఆండ్రాయిడ్, ఐ ఓఎస్ పరికరాలతో చక్కగా జతకట్టి పనిచేస్తుంది. 400 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఒకసారి చార్జ్ చేస్తే 10 రోజులు వాడుకోవచ్చు. 10 నిమిషాలు చార్జ్ చేసి రోజంతా వాడేయొచ్చు. బరువు 26 గ్రాములు. ధర: రూ.14,999. అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నది.