ఒక ఏ4 షీట్ పేపర్ పరిమాణంలో ఉండే టచ్ స్క్రీన్‌ను మూడు మడతలు చేసి.. జేబులో పెట్టుకుంటామని మీరెప్పుడైనా ఊహించారా? యస్.. మీ ఊహ నిజమే! ఇప్పుడు ట్యాబ్ పరిమాణంలో ఉండే ఫోన్‌ను రెండు లేదా మూడు మడతలు పెట్టేసుకోవచ్చు. అలాంటి మూడు మడతల ఫోన్‌ను హువావే సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. ఇది ప్రపంచంలోనే తొలి మూడు మడతల ఫోన్. దీని మొత్తం తెర సైజు 10.2 అంగుళాలు. ఒకసారి మడిస్తే 7.9 అంగుళాలుగా మారిపోతుంది. ఇంకోసారి మడిస్తే 6.4 అంగుళాల ఫోన్లా జేబులో పట్టేస్తుంది.
మడత పెట్టినప్పుడు డిస్ప్లేలో ఎలాంటి తేడా కనిపించదు. అందుకు తగిన ఫ్లెక్సిబుల్ మెటీరియల్‌ను ఈ డిస్ప్లే తయారీలో వాడారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు (12ఎపీ అల్ట్రావైడ్, 12ఎంపీ పెరిస్కోప్) కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ కెమెరా ఉంది. 16జీబీ ర్యామ్‌తోపాటు 256జీబీ/ 512జీబీ/ 1టీబీ స్టోరేజీల్లో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5,600ఎంఏహెచ్ బ్యాటరీలాంటి ఫీచర్లూ ఉన్నాయి. హర్మనీ ఓఎస్ 4.0 వెర్షన్‌తో ఇది పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర.. సుమారు రూ.2,35,100.
ఇంట్లో డెకరేషన్ ఎంత చేసినా.. ఇంకా ఏదో లోపం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎక్కడైనా, ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు.. కొని ఇంట్లో పెట్టేస్తాం. అలాంటి లిస్ట్‌లో ఈ ఎల్ఈడీ లైట్లు హాట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టగొడుగుల్లా కనిపించేవి కూడా ఎల్ఈడీ లైట్లే. స్మార్ట్ ప్లగ్పై వీటిని నాటినట్టుగా డిజైన్ చేశారు. ప్లగ్‌ని సరాసరి స్విచ్ బోర్డుకు పెట్టేసి.. రాత్రి సమయంలో వీటిని వెలిగించొచ్చు. పచ్చని ఆకుల కిందే పలు రకాల లైటింగ్ కాంతుల్ని వెదజట్లుతాయి ఈ 3డీ ఎల్ఈడీలైట్లు. ప్లగ్‌లో ఏర్పాటుచేసిన సెన్సర్‌తో లైట్స్ కాంతి ఆటోమాటిక్‌గా మారుతుంది. ఏడు రకాల రంగుల్లో మారుతూ.. గదిని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. అంతేకాదు.. విద్యుత్‌ను తక్కువగా వాడుకోవడం ద్వారా బిల్లు కూడా ఆదా అవుతుంది.
ధర : రూ.339 దొరికే చోటు : https://tinyurl.com/ycxhkpae
ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, బంధువులకు బహుమతులు ఇస్తుంటాం. అందుకోసం ఏదైనా కొందాం అనుకున్న ప్రతిసారీ తెగ వెతికేస్తుంటాం. తీరిక దొరికితే చాలు ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తుంటాం. అలాంటివారికే ఈ మల్టీపర్పస్ పెన్ను. దీంతో ఐదు రకాల పనులు చేయొచ్చు. రాత్రి సమయాల్లో టార్చ్‌లా పనిచేస్తుంది. లేజర్ లైట్ కూడా ఉంది. ఏదైనా ప్రజెంటేషన్స్ చేస్తున్నప్పుడు పాయింటర్లా వాడుకోవచ్చు. కొన్ని ప్రత్యేక అవసరాల కోసం దీన్ని అయస్కాంతంలా వాడుకునే వీలుంది. గిఫ్ట్ ఫ్యాక్‌లా ప్రత్యేక బాక్స్ పెట్టి ఇవ్వొచ్చు. బాక్స్‌లో అదనపు బ్యాటరీలు కూడా ఉన్నాయి.
ధర : రూ.379
వాటర్ క్యాన్లలోని నీళ్లను గ్లాసులోకి వంచుకుని తాగాలంటే? కష్టమే.. అందుకే ట్యాప్‌తో కూడిన మరో డబ్బాలో ఆ క్యాన్ని బోర్లిస్తే తప్ప అందులోని నీళ్లను తాగడం కష్టం. అయితే.. ఓ చిన్న స్మార్ట్ పరికరం (క్యాన్ డిస్పెన్సర్ పంప్) ఆ ఇబ్బందిని తప్పిస్తుంది. దీనిని క్యాన్కి తగిలిస్తే చాలు. బటన్ నొక్కితే.. పంపులోంచి నీళ్లు ధారగా నీళ్లు వచ్చేస్తాయ్. గ్లాస్ నిండగానే మళ్లీ బటన్ నొక్కితే ట్యాప్ ఆగిపోతుంది. ఈ స్మార్ట్ పరికరం పేరేంటంటే.. Konquer TimeS KTS Automatic Wireless Water Can Dispenser Pump. వాడకంలో ఉన్న 20 లీటర్ల క్యాన్కి దీన్ని ఇట్టే అమర్చుకుని సౌకర్యంగా నీళ్లు తాగొచ్చు. ఇది ఇంట్లో ఉంటే చాలు.. పిల్లలు, పెద్దలు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాన్‌లోని నీళ్లను దేంట్లోకైనా నింపుకోవచ్చు. ‘క్యాన్ ఎవరు తిరగబోస్తారా?’ అని వేచి చూడక్కర్లేదు. యూఎస్బీ కేబుల్‌తో దీన్ని చార్జ్ చేయొచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 4 గంటలు పనిచేస్తుంది.
ధర : రూ.379 దొరికే చోటు : https://tinyurl.com/5n7xjyn7