Assam Tea | ఇండియా మొత్తానికి ఫేమస్ అయిన అస్సాంలోకి తేయాకు తోటలు ఎలా వచ్చాయి?
Assam Tea | భారతదేశ పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈశాన్య రాష్ర్టాల్లో మెలితిరిగిన ‘T’ ఆకారంలో ఓ రాష్ట్రం కనిపిస్తుంది. అదే అస్సాం. ఈ రాష్ట్ర నైసర్గిక స్వరూపం వెనుక ఎవరున్నారో తెలియదు కానీ, అస్సాం ఆవిర్భావానికి శతాబ్దం ముందు నుంచే ఈ ప్రాంతం ‘టీ’కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది!
Assam Tea | భారతదేశ పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈశాన్య రాష్ర్టాల్లో మెలితిరిగిన ‘T’ ఆకారంలో ఓ రాష్ట్రం కనిపిస్తుంది. అదే అస్సాం. ఈ రాష్ట్ర నైసర్గిక స్వరూపం వెనుక ఎవరున్నారో తెలియదు కానీ, అస్సాం ఆవిర్భావానికి శతాబ్దం ముందు నుంచే ఈ ప్రాంతం ‘టీ’కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది! పురాణాల్లో అస్సాంను ‘ప్రాక్ జ్యోతిషపురం’గా ప్రస్తావించినట్టు కనిపిస్తుంది. ఆ సంగతి అటుంచితే, అస్సాంలో తేయాకు మొక్కలు దాదాపు రెండు శతాబ్దాల కిందట వేళ్లూనుకున్నాయి. ఇక్కడి ప్రకృతి, వాతావరణం, గిరులు తేయాకు పంటకు అనుకూలమని 1823లో రాబర్ట్ బ్రూస్ అనే ఆంగ్లేయుడు భావించాడు. అక్కడక్కడా కొన్ని తేయాకు మొక్కలనూ ఆయన గుర్తించాడట. ఇంకేముంది, ఈ శుభవార్త సహచరుల చెవిలో వేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దలంతా అస్సాంలో తేయాకు పండించాలని నిర్ణయించారు. అలా 1839లో ‘అస్సాం టీ కంపెనీ’ ప్రారంభమైంది.
అక్కడి కొండలు, కోనలు తేయాకు తోటలకు ఆలవాలం అయ్యాయి. దాదాపు 184 ఏండ్లుగా అస్సాంలో తేయాకు సాగు విస్తీర్ణం ఏటికేడూ పెరుగుతూనే వస్తున్నది. ప్రస్తుతం సుమారు 3.04 లక్షల హెక్టార్లలో తేయాకు పండిస్తున్నారు. అస్సాం జనాభాలో సుమారు ఐదోవంతు తేయాకు తోటల మీద ఆధారపడి జీవనం సాగిస్తుండటం విశేషం. ఏటా ఈ రాష్ట్రం నుంచి సుమారు 70 కోట్ల కిలోల తేయాకు ఉత్పత్తి అవుతున్నది. మనదేశం మొత్తం ఉత్పత్తిలో సుమారు 50 శాతం వాటా అస్సాందే కావడం విశేషం. ఇక్కడి నేల స్వభావం, వాతావరణం అస్సాం టీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అస్సాం టీ పొడి అని ప్రత్యేకంగా అమ్మకాలు కూడా జోరుగా సాగుతుంటాయి. అందుకే తేనీటి ప్రియులు అస్సాం టీని గంగ కన్నా పవిత్రంగా భావిస్తారు. రెండు చుక్కలు తాగాక అస్సామిరంగా అని పొంగిపోతారు!
మసాలా టీ
కావలసినవి: టీ పొడి: రెండు టేబుల్ స్పూన్లు, పాలు: రెండు కప్పులు, నీళ్లు: రెండు కప్పులు, అల్లం తరుగు: ఒక టేబుల్ స్పూన్, యాలకులు: నాలుగు (నలగ్గొట్టుకోవాలి), లవంగాలు: రెండు, దాల్చిన చెక్క: అర అంగుళం, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, గులాబీ రెక్కలు: కొన్ని
తయారీ: ఒక గిన్నెలో పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేవరకు కాగనిచ్చి, పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నీళ్లు పోసుకొని వేడిచేయాలి. నీళ్లు సెగ పట్టిన తర్వాత అందులో అల్లం తరుగు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మరిగించుకోవాలి. చక్కెర వేసి కలపాలి. చివరిగా టీ పొడి వేసి రెండు కప్పుల నీళ్లు ఒకటిన్నర కప్పు అయ్యేంత వరకు సన్నటి మంట మీద మరిగించుకోవాలి. ఇందాక వేడి చేసుకున్న పాలను డికాక్షన్లో పోసుకోవాలి. రెండు పొంగులు వచ్చాక గులాబీ రెక్కలు వేసి ఒక నిమిషం తర్వాత గ్లాసుల్లోకి వడకట్టుకోవాలి. రుచికరమైన మసాలా టీ సిద్ధం!
టీకా తాత్పర్యం
జీవితం రుచికరమైన టీ వంటిది. ఈ జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది.
– జపాన్ నానుడి
Read More :
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

