గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే అన్నట్టుగా ఆనర్ మళ్లీ మిడ్‌రేంజ్ ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. అదే ఆనర్ X9c. అదిరిపోయే డిస్ప్లేతో ఆకట్టుకుంటున్నది. 6.7 అంగుళాల కర్వ్డ్ అమెలెడ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్‌ని స్మూత్‌గా స్క్రోల్ చేయొచ్చు. దీని బ్రైట్నెస్ హై స్టాండర్డ్‌లో ఉంది. ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా విషయంలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 5MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫొటోగ్రఫీ కోసమే కాకుండా.. వీడియో కాల్స్‌కు కూడా ఇది భలేగా పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6,600mAh. ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా చక్కగా నడుస్తుంది. పైగా 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1. ర్యామ్ 8 జీబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ. ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9.0 ఫోన్లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 (అంచనా).