ఈ వేసవి సెలవుల్లో ఇంటినే ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మార్చేద్దాం అనుకుంటున్నారా? అయితే.. ఇదిగో జెబ్రానిక్స్ నుంచి జెబ్ పిక్సా ప్లే 14 పేరుతో వచ్చిన ప్రొజెక్టర్‌పై ఓ లుక్కేయండి. దీన్ని ఇంట్లో సెటప్ చేసుకుని సినిమాలు, షోలు పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ ఉండటంతో ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా 200 అంగుళాల వరకు పెద్దస్క్రీన్ ఎఫెక్ట్ పొందొచ్చు. వీడియోలు 1080 పి పూర్తి హెచ్డీ క్వాలిటీతో ప్లే అవుతాయి. పైగా 4 కె కంటెంట్ సపోర్ట్ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కంటెంట్‌ను స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా ప్రొజెక్టర్‌పై చూసేలా ఇందులో మిరాకాస్ట్(Miracast), ఎయిర్‌ప్లే (AirPlay) ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిటికీ ఇది పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.1, యూఎస్బీ పోర్టు, హెచ్డీఎంఐ, AUX, డ్యుయల్బ్యాండ్ వైఫై కనెక్షన్లు ఉన్నాయి. ఎలాంటి డివైస్నైనా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని లైఫ్ టైం సుమారుగా 30,000 గంటలు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉండటం వల్ల వీడియోలు ల్యాగ్ లేకుండా ప్లే అవుతాయి.
ధర: రూ.19,999
దొరుకుచోటు: https://rb.gy/ddr2nq
ఏ రంగంలో ఉన్నా.. ఏం చేస్తున్నా.. కచ్చితంగా ఉండాల్సింది ల్యాపీ. మీరూ ఓ ఆల్‌రౌండర్ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నారా? అయితే, సామ్సంగ్ కంపెనీ విడుదల చేసిన గెలాక్సీ బుక్ 4 గురించి తెలుసుకోవాల్సిందే. బరువు కేవలం 1.55 కిలోలు. మెటల్ బాడీతో, సన్నగా.. స్టయిలిష్‌గా కనిపిస్తుంది. దీని డిస్ప్లే పరిమాణం 15.6 అంగుళాలు. ఫుల్ హెచ్డీ అమెలెడ్ డిస్ప్లే. గ్రాఫిక్స్ ఏమైనా.. రంగులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. డ్యూయల్ స్పీకర్లు డాల్బి అట్మోస్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఆడియో క్లారిటీ అదుర్స్. ల్యాప్‌టాప్‌లో రెండు యూఎస్బీ-ఎ, రెండు యూఎస్బీ సి, హెచ్డీఎంఐ, మైక్రోఎస్డీ ఉన్నాయి. మరి, బ్యాటరీ సంగతేంటి? సుమారు 25 గంటలు బ్యాక్అప్ వస్తుందట. ఏఐ ఆధారిత కోపైలట్ టూల్ ఉంటుంది. ఇది పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఫైళ్లను సులభంగా యాక్సెస్ చేయడానికి ‘ఫైల్ ఎక్స్‌ప్లోరర్’ ద్వారా మొబైల్‌తో కనెక్ట్ చేయవచ్చు. వీడియో కాల్స్ కోసం సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ కెమెరాను కనెక్ట్ చేయడం చాలా సులభం. మల్టి కంట్రోల్ ఫీచర్ వల్ల
ల్యాప్‌టాప్ కీబోర్డ్ మౌస్తో ఫోన్, ట్యాబ్ కూడా
నావిగేట్ చేయవచ్చు.
ధర: రూ.38,990
దొరుకుచోటు: https://rb.gy/x3aq02
మణికట్టుపై మాయ చేస్తున్న స్మార్ట్‌వాచ్‌లు లెక్కలేనన్ని మార్కెట్లోకి వచ్చేశాయి. వాటిలో దేనికదే ప్రత్యేకం. అయితే, మీరు సీఎంఎఫ్ తీసుకొచ్చిన ‘నథింగ్ వాచ్ ప్రొ 2’ స్మార్ట్‌వాచ్‌ని చూశారా? చాలా భిన్నమైన లుక్‌తో టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నది. ‘హార్ట్ ఫుల్ ఆల్‌రౌండర్’ ట్యాగ్‌తో ‘రౌండ్ బెజెల్ దీంట్లోని ప్రత్యేకత. అంటే.. వాచ్ ఫేస్‌కి రక్షణగా ఉండే అల్యూమినియం బెజెల్ని ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. అంతేనా.. ఈ వాచ్ మీ రోజువారీ జీవితాన్ని మరింత స్మార్ట్‌గా, ఫిట్‌గా మార్చేస్తుంది. మీ హార్ట్‌రేట్, స్టెప్స్ లెక్కిస్తుంది. వాచ్ తెర పరిమాణం 1.32 అంగుళాలు. అమోలెడ్ స్క్రీన్ రిజల్యూషన్ 466×466 పిక్సెల్స్. చక్కని బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 100+ కస్టమైజ్ చేయగల వాచ్‌ఫేస్‌లతో మీ స్టయిల్‌కు తగ్గట్టు మార్చుకోవచ్చు. ఏఐ నాయిస్ రిడక్షన్‌తో స్పష్టమైన ఆడియో వినిపిస్తుంది. 50కి పైనే వర్కవుట్లను వాచ్ గుర్తిస్తుంది. 340 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 రోజుల వరకు పనిచేస్తుంది.
ధర: రూ.5,499
దొరుకుచోటు: https://rb.gy/x2ab3z
స్మార్ట్‌ఫోన్ టచ్ స్క్రీన్ వెరైటీగా మారిపోతున్నది. కావాలంటే లావా కంపెనీ తయారుచేసిన ‘అగ్ని 3’ ఫోన్‌ని చూడండి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ వెనక భాగంలోనూ ఓ బుజ్జి స్క్రీన్ కనిపిస్తుంది. కావాలంటే ఫోన్‌కి వచ్చిన నోటిఫికేషన్స్ దీంట్లోనే చూడొచ్చు. ఫొటోతోపాటు కాలర్ ఐడీనీ చూసేయొచ్చు. ఇంకా వెనక కెమెరాతోనే హై క్వాలిటీ సెల్ఫీలూ తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ మీ రోజువారీ అవసరాలకు చక్కగా సరిపోతుంది. రోజంతా ఫోన్ వాడినా బ్యాటరీ ఖాళీ అవుతుందేమోనని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక రెండు అమెలెడ్ స్క్రీన్ల విషయానికొస్తే.. 6.78 అంగుళాల పెద్ద స్క్రీన్ 1.5 కె క్వాలిటీ, 120 హెచ్జడ్ రిఫ్రెష్‌రేట్, చక్కని బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో 1.74 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంది. ఇప్పటివరకూ సెల్ఫీలు అంటే ఫ్రంట్ కెమెరాతోనే తీసుకుని ఉంటారు. ఇకపై ఈ బుజ్జి స్క్రీన్‌తో రియర్ కెమెరాతోనూ సెల్ఫీలు తీసుకోవచ్చు. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ ప్రాసెసర్, 8జీబీ రామ్‌తో పాటు 8జీబీ వర్చువల్ రామ్ ఉంది. వెనుక 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్, 8 ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నది.
ధర : రూ.22,998
దొరుకుచోటు: https://rb.gy/qke9rj