మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నది ఏం తింటున్నాం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ మూలాధారం. మనం తినే ఆహారంలోని పోషకాలను శోషించుకొని శరీరం అంతటికీ సరఫరా చేయటంలో దీనిది ముఖ్యపాత్ర. శరీరం ఇనుమును శోషించుకోవాలంటే పొట్టలో ఆమ్లాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే శరీరానికి విటమిన్ బి-12 అందాలన్నా జీర్ణాశయం, పేగుల్లోని గ్రాహకాలు ప్రధానం.
బాగుండాలంటే…