కొన్నిసార్లు పనిలో పడిపోయి తెచ్చుకున్న కాఫీ, టీ తాగడం మర్చిపోతుంటాం. లేదంటే.. కెఫెటేరియాలో తీసుకున్నది డెస్క్ దగ్గరికి వచ్చేసరికి చల్లగా అయిపోతుంది. ఇక ప్రయాణాల్లో చెప్పనక్కర్లేదు.. వేడివేడిగా తేనీరు తాగితే.. ఆ రిలాక్సేషన్ వేరు. అందుకే వేడిగా పొగలు కక్కే కాఫీ కోసం.. ఈ Headway Java స్టెయిన్లెస్ స్టీల్ మగ్ని ప్రయత్నించొచ్చు. ఇది కేవలం కప్పు కాదు.. మీ డ్రింక్‌ను ఎక్కువసేపు వేడిగా ఉంచే ట్రావెల్ మగ్. దీంట్లో పోసిన వేడి కాఫీ అయితే, 3 గంటల వరకు వేడిగా ఉంటుంది.
కోల్డ్ కాఫీ అయితే 6 గంటల వరకు చిల్డ్గానే ఉంటుంది. ఐస్‌తో కూడిన డ్రింక్స్‌ను 12 గంటల వరకు అదే ఉష్ణోగ్రతలో మెయింటైన్ చేస్తుంది. దీంతో ఎంత సమయమైనా మీ డ్రింక్ ఫ్రెష్‌గా ఉంటుంది. దీన్ని హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. దాంతో తుప్పు పట్టదు. దీనికున్న వన్ ట్విస్ట్ ఓపెన్/క్లోజ్ మూత.. పూర్తిగా లీక్ ప్రూఫ్. బ్యాగులో పెట్టినా డ్రింక్ బయటికి రాదు. సిప్పర్ నాజల్ ఉండటం వల్ల సులభంగా తాగొచ్చు.
ధర: సుమారు రూ. 900
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

వింటర్లో రూమ్ హీటర్లు లేకుండా ఉండలేని పరిస్థితి. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఇది చాలా ముఖ్యం. అందుకే మార్కెట్లో దొరికే హీటర్లలో ఏది బెటరా? అని ఆలోచిస్తున్నారా? ఈ సమస్యకు మంచి పరిష్కారం.. ఈ Amazon Brand – Solimo రూమ్ హీటర్. చిన్నదే అయినా, ఇన్స్టంట్ హీట్ ఇస్తుంది. చలిని క్షణాల్లో పారదోలుతుంది. దీనికి 2400 ఆర్పీఎం కాపర్ విండెడ్ మోటార్ ఉంది. ఆన్ చేసిన తక్కువ సమయంలోనే గది మొత్తం వేడెక్కుతుంది. దీని ఎయిర్ త్రో రేంజ్ 10 అడుగుల వరకూ ఉంటుంది.
చిన్న, మీడియం సైజ్ గదులకు మంచి ఎంపిక. ఇందులో కూల్, వార్మ్, హాట్ విండ్ ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చలి తీవ్రతను బట్టి వేడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1.15 కిలోల బరువుండే ఈ హీటర్‌ను ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కు సులభంగా మోసుకెళ్లొచ్చు. నిలువుగా, అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు.
ధర: సుమారు రూ. 1,200
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ఉదయం జిమ్‌కి వెళ్లేవాళ్లు.. హడావుడిగా ఆఫీస్‌లకు పరుగులెత్తేవాళ్లకు బెస్ట్, పవర్ఫుల్ ఆప్షన్.. ఈ పోర్టబుల్ ఎలక్ట్రిక్ బ్లెండర్. ఇది కేవలం జ్యూసర్ మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి సపోర్ట్ అందించే స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్. దీంతో స్మార్ట్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. దీనిని వాడేందుకు ఎలాంటి వైర్లు, ప్లగ్ సాకెట్స్ అక్కర్లేదు. ఇందులోనే 1500 ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంది. దాంతో మీరు జిమ్‌కి, ఆఫీస్‌కి, ట్రావెలింగ్‌కి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.
6 అల్ట్రా-షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్.. 22,000 ఆర్పీఎం వేగంతో కేవలం 30 సెకన్లలోనే స్మూతీలు, జ్యూస్‌లు చేసి పెడుతుంది. ఇందులోని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ టెక్నాలజీ వల్ల బాటిల్, బేస్ కరెక్ట్‌గా ఫిట్ అయితేనే బ్లేడ్స్ తిరుగుతాయి. ఒకవేళ పిల్లలు వాడినా ఎలాంటి అపాయం ఉండదు. శుభ్రం చేయడం చాలా ఈజీ. నీళ్లు పోసి, బటన్‌ను డబుల్ క్లిక్ చేస్తే.. ఆటోమేటిక్‌గా శుభ్రం
అవుతుంది.
ధర: సుమారు రూ. 1,500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

కారు సీట్ల మధ్య, సోఫా మూలల్లో, కీబోర్డులో ఉన్న దుమ్మును క్లీన్ చేయడానికి కష్టపడుతున్నారా? వైర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్‌తో ఇల్లంతా శుభ్రం చేయడం ఇబ్బందిగా ఉందా?. చిన్నపాటి దుమ్మును క్లీన్ చేయడానికి బ్లోయర్ కోసం వెతుకుతున్నారా? ఈ సమస్యలన్నిటినీ.. ఒకే ఒక గ్యాడ్జెట్ దూరం చేస్తుంది. అదే.. SEZNIK 4-ఇన్-1 కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్. దీనిని దుమ్మును లాగేయడానికి మాత్రమే కాదు.. బ్లోయర్‌లా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడంటే అప్పడు కారును, ఇంటిని శుభ్రం చేయొచ్చు.
క్లీనర్‌లో అధునాతన 100W BLDC మోటార్ ఉంది. దీంతో మూడు రకాల మోడ్స్‌ని పెట్టుకుని దుమ్మును లాగొచ్చు. సోఫా మూలల్లో, కారు లోపల ఉన్న మొండి దుమ్మును కూడా ఈజీగా తొలగించొచ్చు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. లో స్పీడ్ మోడ్‌లో 25 నిమిషాల వరకు పనిచేస్తుంది. టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ ఉండటం వల్ల కేవలం 2 గంటల్లోనే ఫుల్‌చార్జ్ అవుతుంది. మెటల్ HEPA ఫిల్టర్‌తో సూక్ష్మంగా ఉండే దుమ్ము రేణువులను కూడా ట్రాప్ చేయగలదు.
ధర: సుమారు రూ. 4,000
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్