ఎండలకు అందగత్తెలంటే అసూయ. ఆమె గడపదాటి బయటికి రాగానే దాడి ప్రారంభిస్తాయి. మేని కాంతిని కిడ్నాప్ చేస్తాయి. కేశ సౌందర్యాన్ని హైజాక్ చేస్తాయి. నెల తిరిగేసరికి గ్లామర్‌ను గుటుక్కుమనిపిస్తాయి. ఆ కుట్రలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫ్యాషన్ పండితులు.
ఈ ఫ్రాక్ చూడండి. వివిధ రకాల చేనేతల కలబోత ఇది. హ్యాండ్ పెయింటెడ్ కలంకారీని కూడా జోడించారు. ప్రయాణాలు, పార్టీలు, ఆఫీస్ ఫంక్షన్లు.. ఏ వేసవి వేడుకకైనా సరిపోతుంది. ఫ్యాషన్‌కు ఫ్యాషన్. కంఫర్ట్‌కు కంఫర్ట్. చల్లదనానికి చల్లదనం.