Nauf Almarai | భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న సౌదీ మహిళ.. ఈమె గురించి మీకు తెలుసా!
నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. దీంతో తన పని సులభమైందని చెబుతారు నవూఫ్. ‘యోగా మనసును శుద్ధి చేస్తుంది.
Nauf Almarai | నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. దీంతో తన పని సులభమైందని చెబుతారు నవూఫ్. ‘యోగా మనసును శుద్ధి చేస్తుంది. హింసాత్మక ఆలోచనలను బుర్రలోంచి తొలగిస్తుంది. ఆధునిక సమాజానికి అవసరమైంది ఇదే’ అని వివరిస్తారామె. తను చేపట్టిన యోగా ప్రచార ఉద్యమానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. నవూఫ్ దృష్టిలో మత విశ్వాసాలకు, దేశాల సరిహద్దులకు అతీతమైంది యోగా.
‘సౌదీ తర్వాత భారతదేశమే నా మాతృభూమి. ఈ దేశం నాకు జ్ఞానాన్ని ప్రసాదించింది. నాలోని నన్ను తెలుసుకునే అవకాశం ఇచ్చింది’ అని ఉద్వేగంగా చెబుతారు. సౌదీ ప్రభుత్వం తమ దేశంలో యోగా క్లాసులను అనుమతించడానికి ముందు చాలా కసరత్తు చేసింది. అనేక అధ్యయనాల తర్వాతే.. పచ్చజెండా ఊపింది. ‘ఆయుర్వేద విజ్ఞానాన్ని సౌదీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. నా తదుపరి ప్రయత్నం ఆ వైపుగానే ఉంటుంది’ అంటూ భవిష్యత్ ప్రణాళిక వివరిస్తారు నవూఫ్. తాజా భారత పర్యటనలో భాగంగా ఆమె కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని సందర్శించారు. ఆ శిల్ప కళా సంపదను రాతితో మలిచిన కావ్యంగా అభివర్ణించారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

