మీ విలువైన ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్స్‌ను ఎక్కడ భద్రంగా స్టోర్ చేసుకోవాలా.. అని ఆలోచిస్తున్నారా? అయితే, మీ డేటా భద్రత, స్టోరేజ్ సమస్యలకు పరిష్కారంగా సీగేట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మార్కెట్లోకి వచ్చింది. ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైళ్లను గాడ్జెట్ హార్డ్‌వేర్ ఎన్క్రిప్షన్, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ద్వారా భద్రంగా ఉంచుతుందని కంపెనీ చెబుతున్నది. విండోస్, మాక్ డివైస్‌లకు సౌకర్యంగా పనిచేసే ఈ డ్రైవ్, యూఎస్బీ 3.0 ఇంటర్ఫేస్తో డేటాను వేగంగా ట్రాన్స్ఫర్ చేయగలదు. ఆటోమేటెడ్, మాన్యువల్ బ్యాకప్ ఫీచర్ ద్వారా డేటా లాస్ సమస్య లేకుండా సేవ్ చేసుకోవచ్చు. అదనంగా 3 ఏళ్ల రెస్క్యూ డేటా రికవరీ సర్వీస్ అందిస్తున్నది. దాంతో, అనుకోకుండా డేటా పోయినా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కంపాక్ట్ డిజైన్‌తో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో సులభంగా మోసుకెళ్లేలా రూపొందించిన ఈ హార్డ్ డిస్క్, ప్రొఫెషనల్స్‌తోపాటు హోమ్ యూజర్లకుకూడా ఉపయోగపడుతుందని కంపెనీ అంటున్నది.
ధర: రూ. 8,000
దొరుకు చోటు: https://shorturl.at/70Tpb
శామ్సంగ్ అభిమానులకు పండగే! ఎందుకంటే ఆ సంస్థ గెలాక్సీ ఎఫ్06 పేరుతో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటంటే.. కాల్స్ క్లియర్‌గా వినిపించే వాయిస్ ఫోకస్ ఫీచర్, డేటాను సురక్షితంగా ఉంచే నాక్స్ వాల్ట్ సదుపాయాలను ఇందులో పొందుపరిచింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.7 అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ స్క్రీన్, వెనకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలాంటి ఫీచర్లు ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా చార్జింగ్ సమస్య లేకుండా ఫోన్‌ని వాడుకోవచ్చు. అంతేకాదు దీనికి 25 వాట్ల వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒన్ యూఐ 7తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి 4 ఏళ్ల వరకూ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు అందుతాయి. ముఖ్యంగా వాయిస్ ఫోకస్, నాక్స్ వాల్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు దీని సొంతం. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో 5జీ అనుభవం కోరుకునేవారికి ఒక మంచి ఎంపిక.
ధర: రూ. 9,499 (4GB RAM + 128GB) , 10,999 (6GB RAM + 128GB)
దొరుకు చోటు: https://shorturl.at/O4gN6
పవర్ఫుల్ ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూసేవారికి శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా ప్రత్యేకం అనొచ్చు. అంతేకాదు.. ఇప్పుడు ఈ మోడల్ మన దేశీయ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చింది. వర్క్ కోసం ఫాస్ట్ ల్యాప్‌టాప్ కావాలి.. అలాగే, గేమింగ్ కోసం హై-ఎండ్ పర్ఫార్మెన్స్తో పనిచేయాలి.. అనుకునే వారికి ఇదో చక్కని ఎంపిక. రెండు అవసరాలను ఒకేసారి తీర్చేలా దీనిని రూపొందించారు. 16 అంగుళాల అమెలెడ్ టచ్‌స్క్రీన్, శక్తిమంతమైన ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, ఎన్వీడియా ఆర్టీఎక్స్ 4050 జీపీయూ వంటివి ఇందులో ప్రత్యేకతలు. దీంతో గ్రాఫిక్స్‌ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. అంతేకాదు.. పెద్దమొత్తంలో వీడియో ఎడిటింగ్ చేసేందుకూ ఉపయోగపడుతుంది. మల్టీ టాస్కింగ్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. అన్ని పనులను వేగంగా ప్రాసెస్ చేస్తుంది. 16GB RAM, 1TB స్టోరేజ్‌తో ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. 76Wh బ్యాటరీ సపోర్ట్‌తో చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పుడు శాంసంగ్ అధికారిక వెబ్సైట్ లేదంటే.. క్రోమాలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. ప్రీమియమ్ లుక్, ప్రీమియమ్ పెర్ఫార్మెన్స్తో కలిసొచ్చే ల్యాప్‌టాప్ ఇదే అనడంలో సందేహం లేదు!!
ధర: రూ.89,000 నుంచి ప్రారంభం.
ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెద్ద స్క్రీన్‌పై చూడాలనుకుంటే థియేటర్ దాకా వెళ్లాల్సిన పనిలేదు. జెబ్రానిక్స్ విడుదల చేసిన జెబ్ పిక్సా ప్లే 54 స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఉంటే చాలు. ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందొచ్చు. ఈ ప్రొజెక్టర్ 3800 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను కలిగి ఉండటంతో, వీడియోలు మరింత స్పష్టంగా, రంగుల హరివిల్లులా కనిపిస్తాయి. 1080పీ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తూ.. 356 సెంటీమీటర్ల వరకు పెద్ద స్క్రీన్ ప్రొజెక్షన్‌ను అందిస్తుంది. బ్లూటూత్ వీ5.1, హెచ్డీఎంఐ, యూఎస్బీ, ఏయూఎక్స్ కనెక్టివిటీ ఆప్షన్లతో ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్లెట్, ఇతర డివైస్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఆడియో అనుభూతిని వేరే లెవల్‌కి తీసుకెళ్లేలా.. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంది. అదనపు స్పీకర్లను కనెక్ట్ చేసి మరింత నాణ్యమైన ఆడియోను ఎంజాయ్ చేయొచ్చు. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో ఈ ప్రొజెక్టర్ పనిచేస్తుంది. యాప్స్ సపోర్ట్, స్క్రీన్ మిర్రరింగ్ (Miracast & iOS) ఫీచర్లనూ అందిస్తుంది. ప్రొజెక్టర్‌ను సులభంగా ఆపరేట్ చేసేందుకు రిమోట్ కంట్రోల్, ఆటో కీస్టోన్ అడాప్టేషన్ ఫీచర్ కూడా ఉంది. అలాగే, 50,000 గంటల లైఫ్‌తో ఎల్ఈడీ ల్యాంప్ ఉండటంతో చాలాకాలంపాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనే హోమ్ థియేటర్ అనుభూతిని కోరుకునేవారికి ఇది అద్భుతమైన ఆప్షన్!
ధర: రూ. 8,000
దొరుకు చోటు: https://shorturl.at/ulkXa