ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా క్రెడిట్ కార్డు కనిపిస్తున్నది. ఒకప్పుడు పెద్దపెద్ద వ్యాపారులు, ఉన్నత స్థాయి ఉద్యోగులకే పరిమితమైనా.. నేడు చిరుద్యోగులకూ చేరువైంది. కానీ, సాధారణ గృహిణులకు మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతున్నది. ఉద్యోగం లేదనో.. ఇంకేదో కారణంతోనో.. సంపాదన లేని మహిళలకు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి పలు సంస్థలు నిరాకరిస్తుంటాయి. కానీ, ఇలా చేస్తే.. గృహిణులు కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.