కాంగ్రెస్ అధికార దుర్వినియోగం.. ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేస్తున్న రేవంత్ : సిరికొండ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు.
- హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో భయానక వాతావరణం
- ప్రలోభాలకు దిగిన కాంగ్రెస్
హనుమకొండ, ఫిబ్రవరి 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పార్టీ అధిష్ఠానం ఆయనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో మంగళవారం తొర్రూరుకు వెళ్లేందుకు సిద్ధం కాగా, సుబేదారి పోలీసులు హనుమకొండ అమరావతినగర్లోని శాంతినికేతన్ అపార్ట్మెంట్ వద్ద అడ్డుకొని ముందస్తు అరెస్ట్ చేశా రు. ఈ సందర్భంగా సిరికొండ మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన, అరాచక రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించా రు.
హంగ్ ఏర్పడిన మున్సిపల్ స్థానాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని మం డిపడ్డారు. మెజారిటీ స్థానాలు గెలువలేకపోయినా దొడ్డిదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ చే స్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు తెలిపా రు. తొర్రూరు మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వ అరాచకాలను అడ్డుకొని తమ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. కేసీఆర్ జన్మదిన వేడుకలకు సైతం వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రేవంత్రెడ్డి బుల్డోజ్ చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్రెడ్డి ప్రభుత్వం తప్పులను లెక్కిస్తున్నారని, కచ్చితంగా సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

