నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా జడల్ పాత్రలో నాని ఫస్ట్‌లుక్ ఆసక్తినిరేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతున్నారు.
ఈ నెల 24న హీరో నాని జన్మదినం సందర్భంగా ‘ఆయా షేర్’ అనే తొలి పాటను విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ పాటను భారీ సెట్లో వందలాది మంది డ్యాన్సర్లతో తెరకెక్కించారు. ఇందులో నాని పక్కా మాస్ అవతారంలో కనిపిస్తారని, అనిరుధ్ రవిచందర్ ట్యూన్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అనివాష్ కొల్లా, దర్శకత్వం: శ్రీకాంత్
ఓదెల.