గుట్కాలు తినేవారిలో, మద్య పానం-ధూమపానం చేసేవారిలో నోటి దుర్వాసన ఎక్కువగా కనిపిస్తుంది. దంతధావనం సరిగ్గా చేయపోయినా.. ఈ సమస్య వేధిస్తుంది. కానీ, కొందరిలో ఏ దురలవాట్లూ లేకపోయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా.. నోటి నుంచి చెడువాసన వస్తుంటుంది. ఇది నలుగురిలో తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది. కాబట్టి, నోటి దుర్వాసనను దూరం చేసే కొన్ని ఇంటి చిట్కాలను నిపుణులు వివరిస్తున్నారు.