ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ తాపత్రయపడుతుంటారు. మురికిని పోగొట్టడానికి, క్రిములను అరికట్టడానికి నీళ్లల్లో రకరకాల లిక్విడ్లు వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తుంటారు. అయితే, ఈ లిక్విడ్లలో ఉండే రసాయనాల వల్ల.. ఇల్లు శుభ్రం మాట అటుంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా కాకుండా, సహజసిద్ధమైన పదార్థాలతో ఇంటిని శుభ్రం చేసుకుంటే.. ఏ సమస్యా రాదు. ఆరోగ్యానికీ భరోసా దక్కుతుంది.
డిష్ సోప్: గిన్నెలు తోమే లిక్విడ్స్‌ని మనం ఫ్లోర్ క్లీనింగ్‌కి కూడా వాడుకోవచ్చు. ఇది మైల్డ్‌గా అనిపించినప్పటికీ నేలపై ఉన్న మొండి మరకల్ని పోగొట్టగలదు. సిరామిక్ టైల్, స్టోన్, ఉడెన్, లామినేట్ లాంటి టైల్స్ ఉన్న ఇంట్లో వాడటం మంచిది. సగం బకెట్ నీటిలో 5 నుంచి 10 చుకల డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత టైల్స్‌ని క్లీన్ చేయండి.
ఎసెన్షియల్ ఆయిల్స్: మీ ఇంట్లో రోజంతా మంచి వాసనలు రావాలనుకుంటే చకగా లెమన్, లావెండర్, పిప్పర్మెంట్ ఆయిల్స్‌ని నీటిలో కలిపి వాటితో మాప్ చేయండి. దీంతో ఇల్లు చకగా క్లీన్ అవుతుంది. ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. వీటితో క్లీన్ చేస్తే ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ అవసరం ఉండదు.
రబ్బింగ్ ఆల్కహాల్: ఇందులోని గుణాలు బ్యాక్టీరియా, వైరస్‌లను దూరం చేస్తుంది. దీనిని నీటిలో కలిపి క్లీన్ చేయడం వల్ల దుర్వాసనలు కూడా దూరమవుతాయి. సగం బకెట్ నీటిలో ఓ కప్పు వరకూ రబ్బింగ్ ఆల్కహాల్ వేసి టైల్స్‌ని క్లీన్ చేయండి.
వెనిగర్: దీంతో టైల్స్‌ని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా దూరమవుతుంది. మరీ మృదువైన ఫ్లోర్ కాకుండా హార్డ్ వుడ్, మార్బుల్ టైల్స్ పై వాడొచ్చు. ఇది మరకల్ని ఈజీగా వదిలించడమే కాకుండా క్రిములని కూడా నాశనం చేస్తుంది.
బోరాక్స్: ఇది బేకింగ్ సోడా లాంటి పవర్ ఫుల్ క్లెన్సింగ్ ఏజెంట్. ఘాటైన మరకల్ని కూడా మటుమాయం చేస్తుంది. ఇది కాస్త ఖరీదైనప్పటికీ మంచి పనితనం ప్రదర్శిస్తుంది. క్రిముల్ని చంపడమే కాకుండా, చీమలు, బొద్దింకల వంటి కీటకాల్ని కూడా ఇంట్లోకి రానివ్వదు. సగం బకెట్ నీటిలో పావు కప్పు బోరాక్స్ పౌడర్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి.