ఇ.వి. ఎంతో స్పెషల్!
రోడ్డు మీద రయ్యిన దూసుకుపోవాలంటే లీటర్ల కొద్దీ పెట్రోల్ మంట పెట్టక్కర్లేదు. పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూనే ప్రయాణం చేయొచ్చని భరోసా ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు).
రోడ్డు మీద రయ్యిన దూసుకుపోవాలంటే లీటర్ల కొద్దీ పెట్రోల్ మంట పెట్టక్కర్లేదు. పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూనే ప్రయాణం చేయొచ్చని భరోసా ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు). కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న వాహనాల కంపెనీలు సైతం వీటి తయారీకి మొగ్గు చూపుతున్నాయి. అందుకే, తాజాగా లాస్ వెగాస్‌లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భవిష్యత్తులో తాము తీసుకురాబోతున్న కార్లను ప్రదర్శించాయి. లుక్‌లోనూ.. టెక్నాలజీలోనూ.. ‘వారెవ్వా!’ అనిపిస్తున్న ఆ మాడల్స్ ఏంటో చూసేద్దాం..
హోండా.. భారత జనాభాకు సుపరిచితమైన సంస్థ. కార్ల అమ్మకాల్లో ముందు వరుసలో ఉన్న హోండా
‘0 సిరీస్’ పేరిట రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను తయారు చేసింది. ‘సలూన్’ పేరిట ఒక సెడాన్, స్పేస్-హబ్ పేరిట ఎస్యూవీ తరహా వాహనాన్నీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శనకు పెట్టింది. వావ్ అనిపించేలా ఉన్న ఈ బండ్లు 2026లో మార్కెట్లోకి రానున్నాయి. వీటి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ను పర్యావరణహిత ఉత్పత్తులతోనే తయారు చేస్తున్నారు.
సౌకర్యంగా ప్రయాణించగలిగేలా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. పక్షి రెక్కల్లా తెరుచుకునే డోర్లతో.. స్పోర్ట్స్ కార్‌ను తలపించే ‘సలూన్’ షోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 2040 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్‌గా అవతరించాలన్నది హోండాలక్ష్యం.

అదే బాటలో..
ఈ మధ్య బాగా పాపులర్ అయిన కియా కూడా ఈ షోలో తన ఫ్యూచరిస్టిక్ కార్లను ప్రదర్శించింది. కారే ఇల్లుగా, ఆఫీసుగా, వ్యానుగా.. ఎలా కావాలంటే అలా మారిపోయేట్టు రూపొందించింది. ప్లాట్ ఫామ్ బియాండ్ వెహికిల్ (పీబీవీ) పేరిట తీసుకొస్తున్న ఈ కార్లు ఇంకాస్త విశాలంగా ఉంటాయి. ఉదాహరణకు.. రాత్రిపూట ప్రయాణించేప్పుడు అర్జంటుగా ఏదో ఆఫీసు పనిపడింది. వెంటనే కారు పక్కకు పెట్టి స్టీరింగ్‌ను పైకి జరిపితే చాలు..
అదే డెస్క్ల్యాంప్లా, డ్యాష్బోర్డే డెస్కులా మారిపోతాయన్నమాట. ఇందులో పీవీ5, పీవీ7, పీవీ1 పేరిట మూడు రకాలను ముందుగా ప్రదర్శించింది సంస్థ. అయితే ఇవి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రావడానికి దశాబ్దకాలం పట్టొచ్చు. అప్పటి వరకూ ఎదురుచూస్తూ ఉండటమే.
ఇంకెన్నో
- వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఏకంగా ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌నే ప్రదర్శనలో ఉంచింది. పనితీరు విషయంలో సాధారణ ట్రక్‌లతో పోల్చినా తగ్గేదేలే అన్నట్టు ఉంటుందీ బండి.
- మెర్సిడెస్ బెంజ్ కూడా లగ్జరీ కార్ల వరుసలో ‘మెర్సిడెస్ కాన్సెప్ట్ సీఎల్ఏ’ పేరిట ఎలక్ట్రిక్ కార్‌ను తీసుకువచ్చింది. 466 మైళ్ల రేంజ్ ఉన్న ఈ బండి.. పదిహేను నిమిషాలు చార్జింగ్ పెడితే 248 మైళ్లు ప్రయాణిస్తుంది.
- హ్యుండాయ్.. ‘మొబియాన్’ మరింత ప్రత్యేకం. ‘ఈ కార్నర్ సిస్టమ్’ అనే టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. దీంతో కారు టైర్లు తొంభై డిగ్రీలకు బదులు 360 డిగ్రీలు తిరుగుతాయి. అంటే కారు అడ్డంగా కూడా వెళుతుంది. దీంతో పార్కింగ్ ఎంతో సులభం. మొత్తానికి సీఈఎస్ వేదికగా రకరకాల సంస్థలు తమ కార్లలో మనల్ని భవిష్యత్తుకు తీసుకెళ్లాయన్నమాట!




Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

