పంచతంత్రం.. మస్క్ మంత్రం!
చరిత్రలోని ఏ విజేత జీవితంలోకి తొంగిచూసినా.. కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవే.. వారి విజయానికి బాటలు వేస్తాయి. అపర కుబేరుడు ఎలాన్మస్క్లోనూ అలాంటి అలవాట్లు ఉన్నాయి.
చరిత్రలోని ఏ విజేత జీవితంలోకి తొంగిచూసినా.. కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవే.. వారి విజయానికి బాటలు వేస్తాయి. అపర కుబేరుడు ఎలాన్మస్క్లోనూ అలాంటి అలవాట్లు ఉన్నాయి. పెద్దపెద్ద కలలు కనడం, వైఫల్యాలను తట్టుకుని నిలబడటం, అసాధ్యం అనుకునే పనులను సాధ్యం చేయడం వంటి లక్షణాలు.. మస్క్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే.. ఎలాన్ మస్క్ పాటించే ఐదు అలవాట్ల గురించి..

1 మస్క్ తన రోజును చిన్నచిన్న భాగాలుగా విభజించుకుంటాడు. దీనిద్వారా తన సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచుకుంటాడు. ఒక్కో పనికోసం కేవలం ఐదు నిమిషాల స్లాటను కేటాయిస్తాడు. దీనివల్ల ప్రతి నిమిషం ఎలా ఖర్చవుతుందో తనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచడానికి, సమయం వృథా కాకుండా చూడటానికి సహాయపడుతుంది.
2 ఏదైనా సమస్యను పరిష్కరించాల్సి వచ్చినప్పుడు.. ఇతరుల అనుభవాలపై ఆధారపడడు. ఆ సమస్యను దాని బేసిక్స్ వరకు విడగొట్టి ఆలోచిస్తాడు. సమస్యకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను విశ్లేషిస్తూ.. మొదటి నుంచి ప్రారంభించడానికి ఇష్టపడతాడు. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనే ఇలాంటి ఆలోచనను సాధారణ జీవితంలోనూ, వ్యాపారంలోనూ ఉపయోగించుకోవచ్చు.

3 మస్క్ పని రాక్షసుడు. వారానికి దాదాపు 80 నుంచి 100 గంటల వరకు పనిచేస్తాడు. కష్టపడి పనిచేయడమే విజయానికి ప్రధాన మార్గమని నమ్ముతాడు. ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఆఫీసులోనే నిద్రపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
4 ఉత్పత్తి, నాణ్యతను పెంచే పనులకే మస్క్ అధిక ప్రాధాన్యం ఇస్తాడు. తనకు ఎలాంటి లాభాన్నీ తెచ్చిపెట్టని మీటింగ్‌లు, సంభాషణల గురించి అంతగా పట్టించుకోడు. అందుకే, అవసరం లేని సమావేశాల నుంచి బయటికి వెళ్లిపోవడాన్ని మస్క్ ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఇదే సూత్రాన్ని పాటించాలని తన ఉద్యోగులకూ సూచిస్తాడు.
5 చేస్తున్న పనిని నిరంతరం సమీక్షించుకోవాలి. దాన్ని మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో ఆలోచించాలి.. మస్క్ తరచుగా చెప్పే మాటలివి. ఈ మాటలే మస్క్ విజయ రహస్యం కూడా. తప్పుల నుంచి నేర్చుకోవడం, విమర్శలను స్వీకరించి తనను తాను మెరుగుపరుచుకోవడం మస్క్‌కు మొదట్నుంచీ అలవాటు. అందుకే, మస్క్ ఎప్పుడూ విమర్శలను సాదరంగా ఆహ్వానిస్తాడు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

