హైడ్రేటెడ్‌గా ఉంటేనే.. అందం!
వేసవి వేడి.. మీ చర్మం తేమను కోల్పోయేలా చేస్తుంది. చర్మం పొడిబారి.. అందం బీటలు వారుతుంది. అంతేకాదు.. సూర్యుడి హానికరమైన యూవీ కిరణాలు.. చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
వేసవి వేడి.. మీ చర్మం తేమను కోల్పోయేలా చేస్తుంది. చర్మం పొడిబారి.. అందం బీటలు వారుతుంది. అంతేకాదు.. సూర్యుడి హానికరమైన యూవీ కిరణాలు.. చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. తద్వారా చర్మం రంగు మారడంతోపాటు ముఖంపై నల్ల మచ్చలూ ఇబ్బంది పెడుతాయి. వీటినుంచి బయట పడాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
- చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసులైనా తీసుకోవాలి. దీనివల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా మారుతుంది.
- నీటిశాతం అధికంగా ఉండే దోసకాయలు, పుచ్చకాయ, నారింజ, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తీసుకోండి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
- ఆహారంలో యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ సి.. శరీరంలో ఫ్రీరాడికల్స్తోపాటు మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. నల్లమచ్చలు రాకుండా కాపాడుతుంది.
- ఇక ఎక్కువ సమయంపాటు ఏసీ గదుల్లో ఉన్నా.. చర్మం పొడిబారుతుంది. ఏసీల నుంచి వచ్చే పొడిగాలి.. చర్మంలో తేమను తొలగిస్తుంది. కాబట్టి, ఇంట్లో, కార్యాలయాల్లో హ్యూమిడిఫయర్స్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి గాలికి తేమను అందించి.. చర్మం ఎక్కువ పొడిగా మారకుండా నిరోధిస్తాయి.
- చర్మ సంరక్షణ కోసం కలబంద వంటి హైడ్రేటింగ్ పదార్థాలను కలిగిన మాయిశ్చరైజర్లు వాడాలి. ఇవి చర్మం తేమను కోల్పోకుండా కాపాడతాయి. చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.
- వేసవిలోనే కాదు.. ఏడాదంతా సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. ఇది హైపర్పిగ్మెంటేషన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రసాయనాలు తక్కువగా ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇక వేసవిలో ప్రతి రెండుమూడు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లయి చేస్తూ ఉండాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

