కాఫీతో ఆరోగ్యం సేఫ్
చాలామంది కప్పు కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అది కేవలం ఒక పానియం మాత్రమే కాదు. మన మైండ్ రిఫ్రెష్మెంట్కు, అలసటను దూరం చేసే ఓ ఔషధం. అయితే, రోజూ తాగే కాఫీని మరింత ఆరోగ్యకరంగా, పోషకాల గనిగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు.
చాలామంది కప్పు కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అది కేవలం ఒక పానియం మాత్రమే కాదు. మన మైండ్ రిఫ్రెష్మెంట్కు, అలసటను దూరం చేసే ఓ ఔషధం. అయితే, రోజూ తాగే కాఫీని మరింత ఆరోగ్యకరంగా, పోషకాల గనిగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు. కాఫీలో చకెర, పాలు మాత్రమే కాకుండా కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలను జోడించడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, జీర్ణక్రియను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ ముఖ్యమైన పదార్థాలేమిటో తెలుసుకుందాం…
కోకో పౌడర్: మీ కాఫీకి కొద్దిగా కోకో పౌడర్ లేదా కాకో (రా) పౌడర్ను జోడించడం వల్ల అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
కోకోలో పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లు పుషలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడులోని రక్త ప్రసరణను మెరుగుపరిచి, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తిని పెంచుతాయి.
ఏ2 నెయ్యి: ఇటీవలి కాలంలో బ్లాక్ కాఫీలో నెయ్యి లేదా వెన్న కలుపుకొని తాగే బుల్లెట్ కాఫీ ట్రెండ్ బాగా పెరుగుతున్నది. కాఫీలో ఒక టీస్పూన్ ఏ2 నెయ్యి కలపడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని బ్యూటెరిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థలో వచ్చే మంటను తగ్గించి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
దాల్చినచెక పొడి: షుగర్ వ్యాధి ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి దాల్చినచెక పొడి ఒక అద్భుతమైన ఆప్షన్. బ్లాక్ కాఫీలో ఒక చిటికెడు దాల్చినచెక పొడిని వేసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజాన్ని క్రమబద్ధీకరించి, రక్తంలో చకెర స్థాయులు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది.
రోజూ తాగే కాఫీ కేవలం కెఫిన్ కిక్ ఇవ్వడమే కాకుండా.. ఈ చిన్న చిన్న మార్పుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే పానియంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ కాఫీ కప్పులో మీకు నచ్చిన ఈ పదార్థాన్ని కలిపి ట్రై చేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

