చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. దీంతో నిగారింపు కోల్పోతుంది. ఇలాంటప్పుడు కొబ్బరి పాలతో చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. పచ్చి కొబ్బరిని తురిమి, కొద్ది నీళ్లతో కలపాలి. లేదా కొబ్బరిని మిక్సీలో వేసి కాస్త నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాని వడకట్టి కొబ్బరి పాలను విడిగా తీయాలి. ఆ పాలలో దూదిని ముంచి ముఖం, మెడలాంటి ప్రాంతాల్లో అద్దాలి. 20 నిమిషాలు ఉంచి చల్లటి నీళ్లతో కడిగేయాలి.