ఇంట్లోకి చీమలు రావడం సహజమే! నలుపు, ఎరుపు చీమలు ఉంటే.. పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ, గోధుమ రంగులో, దుర్వాసన వచ్చే చీమలు మాత్రం.. తెగ చికాకు పెట్టిస్తాయి. వాటిని చీపురుతో ఊడ్చినా.. ఇల్లంతా చెడు వాసన వ్యాపిస్తుంది. అయితే, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే.. వాటిని దూరంగా తరిమేయొచ్చు.