అవాంఛిత రోమాలు.. అతివల అందానికి శాపంగా మారుతాయి. వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తాయి. వ్యాక్సింగ్ చేసినా.. వారంలోనే యథాస్థితికి వచ్చేస్తాయి. ఇలా బ్యూటీపార్లర్లలో వేలకువేలు చదివించకుండా.. వంటింటి చిట్కాలతోనే వాటిని చిటికెలో పోగొట్టుకోవచ్చు.
పాలను కాచి చల్లార్చి.. అందులో కొంచెం పటికబెల్లం పొడి, పసుపు, కాఫీపొడి, గోధుమపిండిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లయి చేసి.. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లిగా వెంట్రుకలకు వ్యతిరేక దిశలో స్క్రబ్ చేస్తూ కడిగేసుకోవాలి.
పొప్పడిపండు గుజ్జులో పసుపు కలిపి.. మాస్క్‌లా చేసుకోవాలి. దీన్ని ఫేస్‌ప్యాక్ వేసుకొని, చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. రోమాలు మాయం అవుతాయి.
పంచదార, నిమ్మరసం.. ఈ రెండిటినీ కలిపి స్క్రబ్‌లా వాడుకోవచ్చు. ముఖంపై ఉన్న వెంట్రుకలను ఇట్టే తొలగించుకోవచ్చు.