సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులు కావాలంటే.. ముందుగా ‘ముల్తానీ మట్టి’వైపే చూస్తుంటారు. మొటిమల్ని తగ్గించడం, నూనెలను తొలగించడంతోపాటు ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుందని చాలామంది దీనిని ఆశ్రయిస్తుంటారు. అయితే, సరైన జాగ్రత్తలు పాటించకుంటే.. ముల్తానీ మట్టి చర్మానికి ముప్పుగా పరిణమిస్తుందని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.