Parenting Tips | మీ బుజ్జాయి క్షణాల్లో బజ్జోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Parenting Tips | పిల్లలను నిద్ర పుచ్చడానికి చాలా సమయమే పడుతుంది. బుజ్జికన్నలు బజ్జొనేలా చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
Parenting Tips | పిల్లలను నిద్ర పుచ్చడానికి చాలా సమయమే పడుతుంది. బుజ్జికన్నలు బజ్జొనేలా చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు తెలుసుకుంటే చంటిపాప కంటినిండా నిద్రపోయేలా చేయడం పెద్ద కష్టమేం కాదు. అదెలాగంటే..
ఆవలింతలు వచ్చాయా..
పిల్లలు గాఢనిద్ర పోవాలంటే.. వారి నిద్రవేళను గుర్తుంచుకోవాలి. నిదురమ్మ ముంచుకొచ్చే వేళ కళ్లను నలుపుకొంటారు. ఏడవటం, ఆవలించటం, చిరాకు వంటి సంకేతాలను ఇస్తారు. ఈ హావభావాలను అర్థం చేసుకోవటం ద్వారా వారు జోలపాట కోరుకుంటున్నారని అంచనాకు రావొచ్చు.
పాలు ఇవ్వడం మరవొద్దు
నిద్రవేళకు ముందు పిల్లలకు తల్లిపాలు పట్టేలా చూసుకోవాలి. కడుపు నిండా పాలు తాగితే కంటి నిండా నిద్రపోతారు. ఆకలి తీర్చకుండానే బజ్జోపెడితే.. సుఖంగా నిద్రించిన అనుభూతి పొందలేరు.
ష్.. గప్‌చుప్
పిల్లలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా చటుక్కున లేస్తారు. ఏ సౌండూ లేని గదిలో హాయిగా నిద్రపుచ్చండి. ఏ అలికిడి లేకపోతే ఆదమరచి నిద్దురోతారు.
ఓ కంట కనిపెట్టాలి
పిల్లలను పడుకోబెట్టిన తర్వాత గానీ తల్లిదండ్రులకు పని చేసుకునే వీలు ఉండదు. ఎంత బిజీగా ఉన్నా.. వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అడపాదడపా గదిలోకి వెళ్లి చూడాలి. డైపర్ తడిగా మారితే అసౌకర్యానికి గురై నిద్ర లేస్తారు. అలా కాకుండా చూసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

