పండిట్ రవిశంకర్ ముద్దుల తనయ.. అనౌష్క శంకర్ హైదరాబాద్ రాబోతున్నారు. కచేరీ చేయబోతున్నారు. జంటనగరాలనుఉర్రూతలూగించబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. మనసులోని భావాలు పంచుకున్నారు.
నచ్చిన వంట
అమ్మ దక్షిణాది మహిళ. తన చేతికి ఏదో మహత్తు ఉందనిపిస్తుంది. కొబ్బరి తురుము వేసిన బీన్స్ కూర అద్భుతంగా వండేది. చారు అయితే అమృతమే. ఆ రుచి ఏ స్టార్ హోటల్లోనూ దొరకదు.
సినిమా సంగీతం
గతంతో పోలిస్తే చాలా మారింది. మ్యూజిక్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి అవకాశం లభిస్తే తప్పక అంగీకరిస్తాను.
కొత్త ఆల్బమ్
‘చాప్టర్-వన్ : ఫరెవర్, ఫర్ న్యూ’ నా సరికొత్త ఆల్బమ్. ఇది నా హృదయావిష్కరణ. మీ ఆశీస్సులు కావాలి. గతంలో వచ్చిన ఆల్బమ్స్కు భిన్నంగా ప్రయత్నించాను. సరికొత్త ట్యూన్స్ జోడించాను.
సితార్ కాకుండా..
పియానో నేర్చుకున్నాను. మిగతా వాద్యాలనూ ఆస్వాదిస్తాను. ఏదైనా సితార్ తర్వాతే. ఏ గురువు అయినా నాన్న తర్వాతే.
ఎందరో మహానుభావులు
భారతదేశంలో ఎంతోమంది కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. చేయి తిరిగిన వాద్యకారులూ ఉన్నారు. వాళ్లందరితో కాకపోయినా.. ఒకరిద్దరితో అయినా కలిసి పనిచేయాలని నా కోరిక.