మనలో చాలామంది ఇంటి పనిని, ఆఫీస్ వర్క్‌ని వేర్వేరుగా చూస్తాం. అందుకే కొందరు రెండు ఫోన్ నెంబర్లు వాడుతుంటారు. ఒకటి ఆఫీస్ పర్పస్కైతే, ఇంకోటి వ్యక్తిగత అవసరాలకు! ఇదే మాదిరిగా మీరు వాడే ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌ను.. రెండు విభాగాలుగా విభజించొచ్చు. దాన్నే ఇప్పుడు టెక్నికల్‌గా ‘ఆండ్రాయిడ్ వర్క్ ప్రొఫైల్’ అని పిలుస్తున్నారు. ఈ సెట్టింగ్స్‌ని ఎవరికి వారే సెట్ చేసుకుని వర్క్ బ్యాలెన్స్‌ని పాటించొచ్చు. అలాగే, కంపెనీలు కూడా ప్రత్యేకంగా ఈ సెట్టింగ్స్‌ని ఐప్లె చేయొచ్చు. ఉదాహరణకు కంపెనీ ఆఫీస్ అవసరాల నిమిత్తం మీకో ఫోన్ ఇస్తే… దాంట్లో ‘వర్క్ ఫ్రొఫైల్, పర్సనల్ ఫ్రొఫైల్’ రెండిటినీ కంపెనీయే క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో మొబైల్ మొత్తం కంట్రోల్ కంపెనీకి ఉంటుంది. మీరేం యాక్సెస్ చేయాలో కూడా కంపెనీనే నిర్ణయిస్తుంది. ఆయా పరిధులకు లోబడే మీ పర్సనల్ లేదా వర్క్ ఫ్రొఫైల్‌ని యాక్సెస్ చేయగలరు.
అందుకు కావాల్సిన పాస్వర్డ్స్, అకౌంట్స్లను కంపెనీనే సెట్ చేస్తుంది. దీంతో ఉద్యోగులు పని సమయంలో తమ వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు. వర్క్ ప్రొఫైల్ ద్వారా, ఉద్యోగులు పని సంబంధిత సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయగలుగుతారు. అంతేకాదు.. ఉద్యోగులు తమ పనికి సంబంధించిన నోటిఫికేషన్లు, అప్డేట్స్ను ప్రత్యేకంగా పొందొచ్చు. ఫోన్ మెయిన్ మెనూ ట్యాప్ చేయడం ద్వారా ఈ రెండు ప్రొఫైల్స్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ వ్యక్తిగతంగా మీరే ఫోన్లో వర్క్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకుంటే.. కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. పర్సనల్ ఫ్రొఫైల్ కూడా మీ కంట్రోల్‌నే ఉంటుంది. వర్క్ ఫ్రొఫైల్లో ఉన్న యాప్స్ నీలి రంగు ‘బ్రీఫ్ కేసు’ ఐకాన్‌తో కనిపిస్తాయి. దీంతో యాప్స్ ఏయే విభాగాలకు సంబంధించినవో ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఈ సదుపాయం ఆండ్రాయిడ్ 5.0, 8.0 వెర్షన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా… ఉద్యోగులు తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా రక్షించుకోవచ్చు.