అమెజాన్ ఎకో.. చెప్పిన పనులన్నిటినీ కచ్చితంగా చేసిపెట్టే నవతరం ‘స్మార్ట్ నౌకర్’గా పేరుతెచ్చుకున్నది. మొదటి ఎడిషన్ వచ్చి 11 ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తూనే ఉన్నది. ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా.. ఎప్పటికప్పుడు అధునాతన అప్‌గ్రేడ్స్‌తో సరికొత్తగా ముస్తాబవుతూనే ఉన్నది. తాజాగా, ‘అమెజాన్ ఎకో షో 5’.. థర్డ్ జనరేషన్ డివైజ్ కూడా వచ్చేసింది. సాంకేతిక సామర్థ్యాలతోపాటు భద్రతా లక్షణాలను కూడా మెరుగుపరుచుకొని.. వినియోగదారుల సేవకోసం వేచిచూస్తున్నది.
దిగ్గజ సంస్థ అమెజాన్.. మూడో తరం ‘ఎకో షో 5’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో ‘ఏజెడ్-2 న్యూరల్ ఎడ్జ్ ప్రాసెసర్’ను వాడారు. దాంతో ఎలాంటి ల్యాగ్ లేకుండా.. మీ ఆదేశాలన్నిటినీ క్షణాల్లో పాటిస్తుంది. మానిటరింగ్ కోసం 5.5 అంగుళాల స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఇష్టమైన సినిమాలు, టీవీ షోలనూ ఇందులోనే చూసేయొచ్చు. వాతావరణ అప్డేట్స్ సహా.. ‘స్మార్ట్‌హోమ్’ను నియంత్రించడానికి, సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన వీడియోలను చూడటానికీ ఉపయోగపడుతుంది. ఇక మ్యూజిక్ లవర్స్ కోసం క్రిస్ప్ ఆడియోను అందించే ఆధునిక స్పీకర్లు ఉన్నాయి. ఒక్కమాట చెబితే.. నచ్చిన పాటలన్నీ క్షణాల్లో ‘ప్లే’ అయిపోతాయి.
అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్తోపాటు మరిన్ని పాడ్‌కాస్ట్‌లు.. మీ ఇంట క్యూ కడతాయి. ఈ ఎకో షో.. స్మార్ట్‌హోమ్ పరికరాలన్నిటినీ మేనేజ్ చేసేస్తుంది. మీ టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ.. టైమర్లతోపాటు రిమైండర్లనూ సెట్ చేస్తుంది. హోమ్ మానిటరింగ్ కోసం ఇన్‌బిల్ట్ కెమెరా ఉంది. అయితే.. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కెమెరా షట్టర్‌తోపాటు మైక్రోఫోన్ ఆన్/ఆఫ్ బటన్‌ను కూడా తీసుకొచ్చారు. కాంపాక్ట్ డిజైన్‌తో అనేక స్మార్ట్ ఫీచర్లతో ఈ అధునాతన డివైజ్ టెక్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నది. ఎంటర్టైన్మెంట్ సహా ఆధునిక గృహ అవసరాలన్నీ తీర్చగల స్మార్ట్‌హోమ్ పరికరం కోసం చూస్తున్నట్లయితే.. ‘ఎకో షో 5’ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అమెజాన్‌తోపాటు అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో ఇది అందుబాటులో ఉన్నది.