వీడియోలు, ఫొటోగ్రఫీ చేసేవారికి లైటింగ్ చాలా ముఖ్యం. సరైన లైటింగ్ ఉంటేనే అవుట్‌పుట్ ఆకట్టుకునేలా వస్తుంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు అమెజాన్ బేసిక్స్ స్టూడియో లైట్ మార్కెట్లోకి వచ్చింది. 240 ఎస్ఎండీ బీడ్స్‌తో ఈ లైట్‌ని రూపొందించారు. దీంతో 3000 కె – 6500 కె కలర్ టెంపరేచర్ రేంజ్‌తో మెరుగైన లైటింగ్‌ను పొందొచ్చు. మామూలు ఫ్లాష్ కంటే దీనికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. నీడలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్‌ని అడ్జస్ట్ చేసుకునే వీలుంది. ఇదే ఈ లైట్‌కి ఉన్న ప్రత్యేకత. ఇంటర్వ్యూలు, ఫొటోగ్రఫీ, కాన్ఫరెన్స్‌లు, కంటెంట్ క్రియేషన్ లాంటి విభిన్న అవసరాలకు ఇది ఉత్తమమైన ఎంపిక. 7-అడుగుల ట్రైపాడ్ స్టాండ్, 360-డిగ్రీ హెడ్ ఎల్ఈడీ వీడియో లైట్, స్టాండ్ బ్యాగ్ వంటి అవసరమైన యాక్సెసరీస్ ఇందులో వస్తాయి. ప్రొఫెషనల్ క్వాలిటీ అవుట్‌పుట్ కోరుకునే కంటెంట్ క్రియేటర్స్‌కి చాలా ఉపయోగపడుతుంది.
ధర: రూ.3,900
దొరుకు చోటు: https://encr.pw/GMOfA
ప్రయాణాల్లో ఉన్నా.. పనుల్లో మునిగిపోయినా.. పాటలు వినడం మీ హాబీనా? మ్యూజిక్‌ని ఎంజాయ్ చేద్దామంటే.. చుట్టుపక్కల శబ్దాలు విసుగు తెప్పిస్తున్నాయా? అయితే, మీ కోసమే నాయిస్ మాస్టర్ బడ్స్ వచ్చేశాయ్. బాస్ ట్యూనింగ్‌తో వచ్చిన ఈ బడ్స్.. మీ మ్యూజిక్ అనుభూతిని వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయి. మీరు వినే ప్రతి పాట, ప్రతి మాట.. చాలా స్పష్టంగా వినిపిస్తాయి. 49 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలను పూర్తిగా అడ్డుకుంటాయి. దీంతో మీరు మ్యూజిక్‌లో పూర్తిగా లీనమైపోతారు. నాయిస్ మాస్టర్ బడ్స్‌లో డ్యూయల్ కనెక్టివిటీ ఉంది. అంటే, ఒకేసారి రెండు ఫోన్లకు కనెక్ట్ అవ్వొచ్చు. గూగుల్ ఫాస్ట్ పెయిర్, హై-రిజల్యూషన్ ఆడియో స్ట్రీమింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 44 గంటలపాటు పాటలు వినొచ్చు. 10 నిమిషాలు చార్జ్ చేస్తే 6 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. స్టయిలిష్ డిజైన్, వినైల్ డిస్క్ ఆకారంలో ఉండే చార్జింగ్ కేస్ అదనపు ఆకర్షణ. నాయిస్ మాస్టర్ బడ్స్ ధర రూ.7,999. అయితే, రూ.999తో ప్రీ-బుకింగ్ చేసుకుంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
ధర రూ.7,999
దొరుకు చోటు: https://l1nq.com/krz71
ప్రీమియం ఫీచర్లు కావాలి. ధర మాత్రం బడ్జెట్లో ఉండాలి.. ఇదే ఆలోచనలో ఉన్నవారికి ఐ క్యూ నియో 10 ఆర్ మంచి ఆప్షన్. గేమింగ్‌లో హై-ఎండ్ అనుభూతిని అందించే శక్తిమంతమైన ప్రాసెసర్ దీని ప్రత్యేకత. ప్రీమియం డిస్ప్లే, లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. 6.78 అంగుళాల అమెలెడ్ స్క్రీన్. 1.5 కె రిజల్యూషన్. రిఫ్రెష్‌రేట్ 120 హెర్ట్. దీని బ్రైట్నెస్ 4500 నిట్స్ ఉండటంతో అవుట్‌డోర్‌లోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12 జీబీ ఫిజికల్ ర్యామ్‌తోపాటు 12 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో మొబైల్ స్పీడ్ గేమింగ్ ప్రేమికులకు తక్కువ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ అనుభూతిని ఇస్తుంది. ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉన్నవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. 50 ఎంపీ సోనీ ఐ ఎంఎక్స్ 882 మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారా 4 కె వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 6400mAhబ్యాటరీ.. 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చిటికెలో చార్జ్ అవుతుంది. లేటెస్ట్ ఫన్‌టచ్ ఓఎస్ 15 సాఫ్ట్‌వేర్‌తో, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బడ్జెట్ రేంజ్‌లోనే ప్రీమియం ఫీచర్లు కావాలంటే.. దీన్ని కొనాల్సిందే!
ధర: రూ.24,999
దొరుకు చోటు: https://encr.pw/3xAFD
ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలని అనుకుంటున్నారా? అయితే, జెబ్రోనిక్స్ జూక్ బార్ 8700 ప్రొ మీకు బెస్ట్ చాయిస్. ఈ సౌండ్ బార్ 5.1 చానెల్ సెటప్‌తో వస్తున్నది. ఇందులో ట్రిపుల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు, సబ్ ఊఫర్ ఉన్నాయి. ఇది 200W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. మీడియం సైజు హాల్ లేదా పెద్ద బెడ్రూమ్కు చక్కగా సరిపోతుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్‌తో పనిచేస్తుంది. మంచి సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది.
ధర: రూ.5,999
దొరుకు చోటు: https://l1nq.com/R3PuD